మీ Facebook అకౌంట్ పేరును మార్చడానికి ప్రయత్నిస్తున్నారా!! అయితే ఇలా చేయండి!

|

ఫేస్‌బుక్ అనేది మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ సైట్. ఫేస్‌బుక్ తన యొక్క వినియోగదారుల కోసం ఉపయోగకరమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ పరిచయం చేసింది. సమాచార భద్రతకు కూడా ఇది గొప్ప ఎంపిక. ఫేస్‌బుక్ వినియోగదారులకు వారి ప్రొఫైల్ సమాచారాన్ని సవరించే ఎంపికను అందించింది. అలాగే వినియోగదారులు వారి పేరును మార్చుకోవడానికి కూడా ఇప్పుడు అనుమతిని ఇస్తోంది.

 

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇప్పుడు వారి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌లో పేరును మార్చవచ్చు. కొన్ని సందర్భాల్లో పేరు మార్పు సంభవించవచ్చు. అలా అయితే ఈ ఎంపిక వినియోగదారులకు సహాయపడుతుంది. ఒకసారి పేరు మార్చుకుంటే కనుక దాదాపు 60 రోజుల వరకు మళ్లీ మార్చడం కుదరదు. వినియోగదారులు మొబైల్ మరియు వెబ్ వెర్షన్ లలో వారి పేరును మార్చవచ్చు. కాబట్టి ఫేస్‌బుక్‌లో మీరు పేరును మార్చడానికి ప్రయత్నిస్తుంటే కనుక కింద ఉన్న దశల వారి గైడ్ ను అనుసరించండి.

Airtel Payments బంగారాన్ని కొనుగోలు చేసే కొత్త సర్వీసును ప్రారంభించింది!!Airtel Payments బంగారాన్ని కొనుగోలు చేసే కొత్త సర్వీసును ప్రారంభించింది!!

ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్‌ ద్వారా అకౌంట్ పేరును మార్చే విధానం
 

ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్‌ ద్వారా అకౌంట్ పేరును మార్చే విధానం

* మీ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాన్ని ప్రారంభించండి.

* మీ అకౌంటుకు లాగిన్ చేసి కుడివైపున దిగువ భాగంలో ఉన్న హాంబర్గర్ మెనుని నొక్కండి.

* క్రిందికి స్క్రోల్ చేసి 'సెట్టింగ్‌లు మరియు ప్రైవసీ'పై నొక్కండి. డ్రాప్ డౌన్ మెను కనిపిస్తుంది మరియు మీరు సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి.

* ఇప్పుడు 'వ్యక్తిగత మరియు అకౌంట్ సమాచారం' ఎంపికకు వెళ్లి పేరును ఎంచుకోండి.

* తరువాత మీ కొత్త పేరును నమోదు చేసి రివ్యూ మార్పును నొక్కండి. ఇది మిమ్మల్ని పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. నమోదు చేసి మార్పులను సేవ్ చేయి ఎంపిక మీద నొక్కండి.

* కొంత సమయం తర్వాత మీ కొత్త పేరు మీ Facebook ప్రొఫైల్‌లో ప్రత్యక్షం అవుతుంది.

 

బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ పేరును మార్చే విధానం

బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ పేరును మార్చే విధానం

* https://www.facebook.com/కి వెళ్లి మీ అకౌంట్ కి లాగిన్ అవ్వండి.

* కుడివైపు ఎగువ మూలలో గల నోటిఫికేషన్‌ల చిహ్నం పక్కన ఉన్న డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి.

* 'సెట్టింగ్‌లు మరియు ప్రైవసీ' > 'సెట్టింగ్‌లు' ఎంపికల మీద క్లిక్ చేయండి.

* ఇది మీ అకౌంట్ సమాచారాన్ని చూపుతుంది. 'పేరు' పక్కన ఉన్న సవరణ ఎంపికపై క్లిక్ చేయండి.

* మీ కొత్త పేరును నమోదు చేసి 'రివ్యూ మార్పు' ఎంపిక మీద నొక్కండి. ఇది పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని మిమ్మల్ని అడుగుతుంది. నమోదు చేసి, మార్పులను సేవ్ చేయి నొక్కండి.

* కొంత సమయం తర్వాత మీ కొత్త పేరు మీ Facebook ప్రొఫైల్‌లో ప్రత్యక్షం అవుతుంది.

 

మీ Facebook ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేయాలి

మీ Facebook ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేయాలి

స్టెప్ 1: మీ Facebook ప్రొఫైల్ పేజీని సందర్శించండి

స్టెప్ 2: ఆపై మీ ప్రొఫైల్ పేరులో 'మోర్' ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 3: డ్రాప్ డౌన్ మెను నుండి 'లాక్ ప్రొఫైల్' ఎంపిక కోసం చూడండి మరియు దానిపై క్లిక్ చేయండి

స్టెప్ 4 : మీ స్క్రీన్‌పై నొక్కిన తర్వాత మీరు నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.

స్టెప్ 5: మీ ప్రొఫైల్‌ను లాక్ చేయడానికి 'మీ ప్రొఫైల్‌ను లాక్ చేయి'ని క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
Are You Trying to Change Your Facebook Account User Name! Follow These Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X