మీరు వాడే సెల్‌ఫోన్ నకిలీదా..?

Posted By: Staff

మీరు వాడే సెల్‌ఫోన్ నకిలీదా..?

‘తస్మాత్ .. నాణ్యత లేని నకిలీ ఫోన్ ఉపయోగించకండి.. ఏక్షణంలోనైనా అది పేలే ప్రమాదముంది. ’

ఆధునిక జనజీవన స్రవంతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడపలేని పరిస్థితి. మనవాళి అభిరుచులకు తగట్లుగానే రకరకాల సెల్‌ఫోన్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అయితే వీటిని తలదన్నే రీతిలో డమ్మీ మోడల్ మొబైల్ హ్యాండ్ సెట్‌లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని విక్రయిదారులు తమ మాయమాటలతో చాలామందికి అంటగడుతున్నారు. మొబైల్ ఫోన్‌ల వ్యాపారంలో భాగంగా హైదరాబాద్ లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్ మినీసెల్ వరల్డ్‌గా ప్రసిద్దికెక్కింది.

ఈ మార్కెట్లో దొరకని ఫోన్ అంటూ ఉండదు. అన్నిరకాల సెల్‌ఫోన్‌లకు సంబంధించి సేల్స్ ఇంకా సర్వీసింగ్ ఇక్కడ జరుగుతుంది. చైనా ఫోన్లు మొదలుకుని ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ ఫోన్‌ల వరకు సకలం లభ్యమవుతాయి. దాదాపు ఈ మార్కెట్లో 200కు పైగా గ్యాడ్జెట్‌లను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. నకిలీ సెల్‌ఫోన్‌లకు ఈ మార్కెట్ అడ్డా. వినియోగదారులకు టోకరా వేస్తూ బ్రాండెడ్ కాని సెల్‌ఫోన్‌లను ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్లో సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారు ఆచితూచి స్పందించటం అవసరం. ఏమాత్రం ఆశ్రద్ద వహించినా పెద్ద ఎత్తున టోకరా తప్పదు.

ఇటీవల కాలంలో ఈ మార్కెట్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ నోకియా ఇయర్ ఫోన్లు, బ్యాటరీలు, ఫోన్ ప్యానెల్స్, నకిలీ మొబైల్ ఫోన్స్ లు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఎన్ 97, ఎన్ 80 సిరీస్ ల ఫోన్లు కూడా ఉన్నాయి. వాటికి వ్యాలిడ్ ఐఎమ్ఇఐ నెంబర్లు లేకపోవడం విశేషం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot