ఇస్రో దీపావళి ధమాకా

Written By:

ఇస్రో దీపావళి ధమాకా మోగించింది. దీపావళి పర్వదినాన నింగిలోకి తన శాటిలైట్ ను పంపి అక్కడ టపాసుల వెలుగులు విరజమ్మింది. ప్రజలకు దీపావళి పర్వదినాన ఇస్రో తన విజయాన్ని కానుకగా అందించింది. ఈ ఉపగ్రహంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. దాదాపు 3,164 కిలోల భారీ బరువున్న జీశాట్ -15 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సందడి నెలకొంది.సరిగ్గా దీపావళి పర్వదినాన జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్ర్తవేత్తలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :గూగుల్ సీక్రెట్ కోడ్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీపావళి పర్వదినాన మరో ఘన విజయం

దీపావళి పర్వదినాన మరో ఘన విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దీపావళి పర్వదినాన మరో ఘన విజయం నమోదు చేసుకుంది.కమ్యూనికేషన్,నావిగేషన్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన జీ శాట్ -15 ప్రయోగం విజయవంతమైంది.

జీ శాట్ -15తో పాటు అరబ్ శాట్ -6లను

జీ శాట్ -15తో పాటు అరబ్ శాట్ -6లను

ప్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నేటి ఉదయం జరిగిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది. జీ శాట్ -15తో పాటు అరబ్ శాట్ -6లను కూడా ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

భారతదేశ అత్యాధునిక కమ్యూనికేషన్ల ఉపగ్రహం

భారతదేశ అత్యాధునిక కమ్యూనికేషన్ల ఉపగ్రహం

భారతదేశ అత్యాధునిక కమ్యూనికేషన్ల ఉపగ్రహం జీశాట్‌ -15 ఫ్రెంచ్‌ గయానాలోని కౌరౌ నుంచి బుధవారం తెల్లవారుజామున 3-04 గంటలకు దీనిని ప్రయోగించినట్లు ఇస్రో తెలిపింది.

టెలికమ్యూనికేషన్ల సేవలకు, నేవిగేషన్‌, అత్యవసర సేవలకు

టెలికమ్యూనికేషన్ల సేవలకు, నేవిగేషన్‌, అత్యవసర సేవలకు

టెలికమ్యూనికేషన్ల సేవలకు, నేవిగేషన్‌, అత్యవసర సేవలకు ఉపయోగపడేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. అరబ్‌శాట్‌-6బిని రోదసిలోకి పంపిన తర్వాత జీశాట్ -15ను జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి పంపించారు.

జీశాట్‌-15 బరువు 3,164 కేజీలు

జీశాట్‌-15 బరువు 3,164 కేజీలు

జీశాట్‌-15 బరువు 3,164 కేజీలు. ఇన్‌శాట్, జీశాట్‌ సిస్టమ్‌లోకి పంపించిన అత్యంత శక్తిమంతమైన ఉపగ్రహం జీశాట్‌ -15. కేయూ బ్యాండ్‌లో 24 కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లను మోసుకుపోగలదు. ఎల్‌1, ఎల్‌5 బ్యాండ్లలో జీపీఎస్‌ ఎయిడెడ్‌ జీఈఓ ఆగ్‌మెంటెడ్‌ నేవిగేషన్‌ పేలోడ్‌తో పని చేస్తుంది.

కౌరౌలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌ ఎం. అన్నాదురై మాట్లాడుతూ ..

కౌరౌలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌ ఎం. అన్నాదురై మాట్లాడుతూ ..

కౌరౌలో ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌ ఎం. అన్నాదురై మాట్లాడుతూ జీశాట్-15 ఉపగ్రహం సంకేతాలు కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్ ఫెసిలిటీ స్వీకరించినట్లు తెలిపారు. ఇనిషియలైజేషన్‌ కమాండ్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఉపగ్రహం బాగా పని చేస్తోందని చెప్పారు.

జీశాట్‌-15తో దేశంలోని కేయూబ్యాండ్ యూజర్లకు నిరంతర సేవలు ..

జీశాట్‌-15తో దేశంలోని కేయూబ్యాండ్ యూజర్లకు నిరంతర సేవలు ..

జీశాట్‌-15తో దేశంలోని కేయూబ్యాండ్ యూజర్లకు నిరంతర సేవలు అందజేయడానికి వీలవుతుందన్నారు. పౌర విమానయానం, తదితర సేవలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. జీశాట్‌-17, జీశాట్‌-18 ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ రికార్డెడ్ వీడియో సందేశంలో ..

ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ రికార్డెడ్ వీడియో సందేశంలో ..

ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ రికార్డెడ్ వీడియో సందేశంలో మాట్లాడుతూ జీశాట్‌-15 ప్రయోగం వల్ల ఉపగ్రహ చోదక మౌలిక సదుపాయాల వ్యవస్థ బలోపేతం దిశగా ముందడుగు పడినట్లయిందన్నారు. దేశంలోని కమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సుస్థిరమవుతుందన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ariane 5 successfully launches- arabsat 6b and gsat 15
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting