Artificial Intelligence ప్రభావంపై ఎలాన్ మస్క్ ఆందోళన.. చరిత్రలో అత్యంత విధ్వంసక శక్తి అంటూ కీలక వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI- Artificial intelligence) అందుబాటులోకి వచ్చిన నుంచి ఈ టెక్నాలజీపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు.. భవిష్యత్‌ను ఏఐ సులభతరం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంత మంది వ్యక్తులు మాత్రం ఏఐ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని, భవిష్యత్‌లో ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. గతంలో జరిగిన సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి విరామం ప్రకటించాలని, ఈ రంగంపై స్పష్టమైన నియంత్రణ ఉండాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా యూకే ప్రధాని రిషి సునక్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై మరోసారి తన ఆందోళన వ్యక్తం చేశారు. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత విధ్వంసక శక్తి అని ఉద్యోగాలను స్వాధీనం చేసుకోవచ్చని' అన్నారు. AI భద్రతపై నిర్వహించిన సమావేశంలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో మాట్లాడారు.
'చరిత్రలో అత్యంత విధ్వంసకర శక్తిని చూస్తున్నాం. భవిష్యత్‌లో ఉద్యోగం అవసరం లేని స్థితి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి పనిని చేయగలదు. ఇది కొంత మంచి మరికొంత చెడు చేస్తుంది' అని మస్క్ అన్నారు. మస్క్ గతంలోనూ ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేశారు.

* ఈ సంవత్సరం జులై నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAIను స్థాపించారు. ఇందుకు సంబంధించిన టీమ్‌ను కూడా మస్క్ ప్రకటించారు. ఈ బృందంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటిని ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐలో పనిచేసిన ఇంజినీర్లు ఉన్నాయి. ChatGPTకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాంను ఏర్పాటు ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
xAI బృందానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్‌లను కలిగి ఉందని సంస్థ గతంలోనే తెలిపింది. వీరంతా గతంలో గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి సంస్థల్లో ఏఐ విభాగంలో పనిచేసిన అనుభవం ఉందని పేర్కొంది. టోరంటో యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అనుభవం ఎగ్జిక్యూటివ్‌లు తమ సొంతమని xAI స్టార్టప్ వెల్లడించింది.
xAI స్టార్టప్ స్థాపించడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడం, భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయ అంశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలకు విస్తరిస్తోంది.
అయితే చాలా మంది సాంకేతిక నిపుణులు సహా టెక్ సంస్థల సీఈవోలు ఏఐ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఓ సమావేశంలోనూ అధిక శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏఐ టెక్నాలజీతో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








