ఇంట్లో మబ్బులు...డచ్ కళాకారుడి అద్భుతం!

Posted By: Staff

 ఇంట్లో మబ్బులు...డచ్ కళాకారుడి అద్భుతం!

 

తన రూపురేఖలను క్షణాల్లో మార్చుకుంటూ ఆకాశానికి మరింత వన్నే తచ్చే మేఘాలు మన ఇంట్లో హల్ చల్ చేస్తే... నిజంగా!  ఆ అనుభూతే అద్భతం. ఈ అసాధ్యాన్ని, సుసాధ్యం చేసే క్రమంలో ఓ కళకారుడి ఆలోచనల నుంచి జారువాడిన అద్భుత కల్పన ఈ ఏడాదికి గాను ఉత్తమ ఆవిష్కరణగా గుర్తింపు పొందింది. వివరాల్లోకి వెళితే...... డచ్ ప్రాంతానికి చెందిన కళకాళారుడు  బెర్న్‌డ్నాట్ స్మైల్డ్, అంతరిక్ష తేమ, ఉష్ణోగ్రత ఇంకా కాంతులను జాగ్రత్తగా నియంత్రిస్తూ ఇండోర్ మబ్బులను సృష్టించగలిగాడు. ఇంటి లోపల వివిధ ప్రదేశాల్లో మేఘాలను ఆవిష్కరించే క్రమంలో బెర్న్‌డ్నాట్ పొగమంచు యంత్రాన్ని ఉపయోగించి వివిధ ఆకృతులలతో తెల్లటి మబ్బులను సృష్టించగలిగాడు. కెమెరాలలో బంధించబడిన ఆ అద్భుత దృశ్యాలకు  టైమ్ మ్యాగజైన్ '2012 ఉత్తమ కల్పనలగా"నామకరణం చేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting