ట్విట్టర్‌లో ఇండియాలో నంబర్ వన్ సీఎం తెలుసా ?
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్ నే. ఏ న్యూస్ అయినా క్షణాల్లో యూజర్ల ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ట్వీట్లతో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్ నే. ఏ న్యూస్ అయినా క్షణాల్లో యూజర్ల ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ట్వీట్లతో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అందుకే సెటబ్రిటీలంతా ట్విట్టర్ ద్వారానే తమ మనసులోని మాటను పంచుకుంటుంటారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ట్విట్టర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. ఆయన ఒక్కరే కాదు... రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ప్రతిపక్ష నేతలు కూడా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ జనంతో టచ్‌లో ఉంటారు.

అయితే ఈ శీర్షికలో భాగంగా ట్విట్టర్‌లో ఏ సీఎంకు ఎక్కువ పాపులారిటీ ఉందో ఓ సారి తెలుసుకుందాం.

అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ఫాలోయర్ల మనసు దోచుకోవడంలో ముందున్నారు. ఎప్పుడూ బీజేపీని విమర్శించడంలో ముందుండే కేజ్రీవాల్‌కు ట్విట్టర్‌లో 14.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పటివరకు 27.4 వేల ట్వీట్లు చేయడం విశేషం.

నితీష్ కుమార్:
జనతాదళ్-యూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు 4.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఆయన రెండో ప్లేస్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 3000 ట్వీట్లుచేశారు.

చంద్రబాబు నాయుడు:
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉన్న సీఎంలల్లో మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు 4.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పటివరకు 6.4 వేల ట్వీట్లు చేశారు. రోజుకు ఆయన 25 ట్వీట్లు చేస్తున్నారు.

యోగీ ఆదిత్యనాథ్:
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు 3.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఆయన సమావేశాలు, సభలకు సంబంధించిన ట్వీట్స్ ఎక్కువ చేస్తారు. ఆసక్తికర అంశం ఏంటంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నేత ట్వీట్‌ను రీ ట్వీట్ చేయలేదు.

దేవేంద్ర ఫడ్నవీస్:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్విట్టర్‌లో 3.4 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 30 వేల ట్వీట్స్ చేశారు. ఎక్కువగా తమ బీజేపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి సంబంధించిన ట్వీట్స్ చేస్తుంటారు.

మమతా బెనర్జీ:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి 3.4 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఈ సీఎం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. ఇప్పటివరకు 5.2 వేల ట్వీట్స్ చేశారు.ఈమె కూడా ఎవరి ట్వీట్‌ను రీట్వీట్ చేయరు.


Click it and Unblock the Notifications








