KYC వెరిఫికేషన్ కోసం మీ ఇంటికే వస్తున్న ఫోన్‌పే

By Gizbot Bureau
|

ఇ-కామర్స్ నిబంధనలను కట్టడి చేసిన తరువాత, డిజిటల్ వాల్లెట్స్ వంతు వచ్చింది.ఆధార్ తీర్పులో భాగంగా, KYC ఆధార్ డేటాను ఉపయోగించకుండా సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థలను నిషేదించనుందనే సమాచారం నేపథ్యంలో అన్ని పేమెంట్ యాప్ లు వినియోగదారుల డేటా ధృవీకరణ నిబంధనలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ వాలెట్ వినియోగదారుల్లో 80% పైగా KYC తో ఇంకా లింక్ చేయబడలేదని నివేదిక పేర్కొంది.

PhonePe rolls out doorstep verification

వినియోగదారులు OTP ధృవీకరణ పద్ధతిని ఉపయోగించి పాక్షిక KYC ని పూర్తి చేయగలరు, కానీ పూర్తి KYC ని చేయడానికి, వారు చిరునామా రుజువు మరియు ID రుజువు వంటి పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియ దుర్భరమైనదని భావిస్తూ, ప్రజలు ఇప్పుడు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలకు బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్‌పే డోర్‌స్టెప్ వెరిఫికేషన్ ను ప్రారంభించింది. మీ ఇంటికే వచ్చి వారు KYC వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు.

95 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపులు

95 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపులు

ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్' నిర్వహణలోని ‘ఫోన్ పే' మొత్తం 95 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపుల విలువ (టీపీవీ) రన్ రేటును సాధించినట్టు కంపెనీ తెలిపింది. కేవలం జూలై నెలలోనే 335 మిలియన్ల లావాదేవీలు ‘ఫోన్‌పే' ద్వారా జరిగాయని వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో 20 బిలియన్ డాలర్ల మార్కును దాటినప్పటికే ఫోన్‌పే టీపీవీ రన్‌రేటు 5ఎక్స్ స్థాయికి వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వాణిజ్య నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారానే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ తెలిపారు.

698 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని

698 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని

కాగా గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎమ్ తరహాలోనే మనదేశ డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఫోన్‌పే ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈక్రమంలో సింగపూర్‌కు చెందిన ఫోన్‌పే (గతంలో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి 698 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందుకుంది. కాగా దేశంలో ఫోన్‌పేకు వస్తున్న ఆదరణ తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తోందని సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు.

వాడే వారి సంఖ్య 60 మిలియన్లు

వాడే వారి సంఖ్య 60 మిలియన్లు

తమ యాప్‌ను దేశంలోని 60 మిలియన్లమంది వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 15 మంది భారతీయ పౌరుల్లో ఒకరు తమ యాప్‌నకు వినియోగదారులుగా ఉన్నారని ఆయన తెలిపారు. కేవలం మూడేళ్ల క్రితం ఏర్పాటైన తమ కంపెనీకి బెంగళూరు ప్రధాన కార్యాలయ పరిధిలో 150 మిలియన్ల మంది వినియోగదారులు ఏర్పడ్డారని తెలిపారు. అలాగే 50 లక్షల వాణిజ్య ఔట్‌లెట్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా భారతీయ వినియోగదారులు ఆదరిస్తున్నారని ఆయన వివరించారు.

 ఎన్పిసిఐ సమాచారం ప్రకారం

ఎన్పిసిఐ సమాచారం ప్రకారం

ఆర్బిఐ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) సమాచారం ప్రకారం, వాలెట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయినా, గత రెండు నెలల్లో ఈ సంఖ్యలు తగ్గాయి. డిసెంబరులో గత ఏడాది UPI ద్వారా 620 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.బెంగళూరుకు చెందిన చెల్లింపులు సంస్థ జాతీయ దినపత్రికలో పేర్కొంటూ, పొడిగింపు మరియు ప్రత్యామ్నాయ KYC ఉపకరణాలపై బ్యాంకింగ్ రేగులతోర్ తో నిరంతరం చర్చ జరుగుతోంది కానీ ప్రస్తుతానికి ఏదీ ఆమోదించబడలేదు అన్నారు. "ఇతర కంపెనీలు కూడా KYC విధానాల్లో ఇదే రకమైన కష్టాలను ఎదుర్కుంటున్నాయన్నారు.

ఫోన్ పే వంటి వేదికలు

ఫోన్ పే వంటి వేదికలు

అమెజాన్ మరియు పేటియం వంటి ఈ వ్యాలెట్ల వాడే వారి సంఖ్య అదికంగా ఉండటం కారణంగా మరింత ప్రభావితమవుతాయని భావిస్తున్నారు.ఫోన్ పే వంటి వేదికలు UPIపై మరింత దృష్టి కేంద్రీకరించాయి కాబట్టి, అవి చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అమెజాన్ ఇటీవలే KYC డాక్యుమెంట్లను సేకరించడానికి వినియోగదారుల ఇంటికి నేరుగా తం వుత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభించారు. వీరి బాటలోనే ఇప్పుడు ఫోన్ పే కూడా నడుస్తోంది. KYC వెరిఫికేషన్ కోసం ఇంటి వద్దకే వస్తోంది.

కేవైసీ

కేవైసీ

జనవరి 1 నుంచి బ్యాంకులో ఖాతా ప్రారంభించే వ్యక్తుల కేవైసీలు తప్పనిసరిగా ఈ రిజిస్ట్రీకి అప్‌లోడ్‌ చేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల‌ను ఆదేశించింది. జనవరి నెల మొత్తంమీద జతచేరిన ఖాతాదారుల వివరాలు ఫిబ్రవరి 1 నాటికి అప్‌లోడ్‌ కావాల్సిందే. మిగిలిన ఆర్థిక సంస్థలు కూడా వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి నూతన ఖాతాదారుల వివరాలు అప్‌లోడ్‌ చేయాలని నిర్దేశించింది. ఖాతాదారుల పరిస్థితికి అనుగుణంగా ఈ-కేవైసీని కూడా అనుమతిస్తారు. ఇందుకు వన్‌టైమ్‌ పిన్‌ (ఓటీపీ)ని ఆధారం చేసుకుంటారు. అయితే ఈ ఖాతాదారుల డిపాజిట్‌ రూ.లక్షకు మించడానికి వీలుండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి ఖాతాదారులు తీసుకునే అన్ని రుణాల మొత్తం రూ.2 లక్షలు మించకూడదు.

 రూ. 50 వేల పైబ‌డి డిపాజిట్ల‌కు

రూ. 50 వేల పైబ‌డి డిపాజిట్ల‌కు

ప్ర‌స్తుతం రూ. 50 వేల పైబ‌డి డిపాజిట్ల‌కు పాన్ కార్డు వివ‌రాల‌ను సైతం త‌ప్ప‌నిస‌రి చేశారు. సంబంధిత ఖాతాపై ఏదైనా విచారణ జరపాల్సి వచ్చినప్పుడు, ఇవే పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇప్పటివరకూ ఈ వివరాలను బ్యాంకుల వద్దే భ‌ద్ర‌ప‌రుస్తున్నారు. ఇకపై అన్ని బ్యాంకుల ఖాతాదారుల వివరాలు 'కేవైసీ కేంద్రీయ రికార్డుల రిజిస్ట్రీ' వద్ద నమోదు కానున్నాయి.

Best Mobiles in India

English summary
As KYC deadline looms, PhonePe rolls out doorstep verification

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X