చిచ్చురేపుతున్నఅక్రమ సంబంధాల గుట్టు

Posted By:

పలువురి కాపురాల్లో చిచ్చురేపిన అక్రమ సంబంధాల వెబ్‌సైట్ యాష్లె మాడిసన్ ఉదంతం భారతీయులకూ ముచ్చెమటలు పటిస్తోంది. ఈ చాటు మాటు వ్యవహారల సెగ భారత్‌కు తాకటంతో పలువురు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన 30 కోట్ల పై చిలుకు యూజర్లకు సంబంధించిన వివరాలను హ్యాకర్లు ఇటీవల విడుదల చేసి సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.

Read More : మోటరోలా ఫోన్‌ల పై డిస్కౌంట్ల మోత

హ్యాకర్లు విడుదల చేసిన జాబితాలో భారత్‌కు సంబంధించి 1,37,000 పై చిలుకు మంది ఈ చీకటి భాగోతాల వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయినట్లు ఓ వెబ్‌సైట్ తెలిపింది. వీరిలో ఢిల్లీకి సంబంధించిన వారు 38,620, ముంబైకు చెందిన వారు 32,888, చెన్నైకు చెందిన వారు 16,355, బెంగుళూరు చెందిన వారు 16, 267, హైదరాబాద్ కు చెందిన వారు 12,548, కోల్‌కతాకు చెందిన వారు 11,751, పూణేకు చెందిన వారు 9,738 ఉన్నట్లు ఓ కంపెనీ వెల్లడించిన గణంకాల ద్వారా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డేటింగ్‌తో జరభద్రం

ఆన్‌లైన్‌లో మీకు సరైన జోడీని వెతుక్కోండి అంటూ డేటింగ్ వెబ్‌సైట్లు వల విసురుతుంటాయి. అలా చెప్పే సైట్లన్నీ మోసపూరితమైనవంటూ ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆన్‌లైన్ డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా జేబులకు చిల్లు పడటంతో పాటు, ప్రాణాంతకమైన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని చెబుతోంది.

డేటింగ్‌తో జరభద్రం

ఇద్దరి అంగీకారంతో శృంగారానికి వీలు కల్పించే ఈ డేటింగ్ వెబ్‌సైట్లు, తద్వారా హెచ్‌ఐవీ, ఇతర సుఖవ్యాధులకు సంబంధించిన వైరస్‌లను వ్యాపింపజేస్తున్నాయని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ రీతు అగర్వాల్ (రాబర్ట్ హెచ్‌స్మిత్ బిజినెస్ స్కూల్) తెలిపారు.

డేటింగ్‌తో జరభద్రం

ఫ్లోరిడాలో నాలుగేళ్ల వ్యవధిలో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగడానికి క్రెయిగ్ లిస్ట్ అనే అడల్డ్ డేటింగ్ వెబ్‌సైట్ కారణమయిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

డేటింగ్‌తో జరభద్రం

ఈ డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఎవరైతే శృంగారంలో కలిశారో వారిలో అత్యధికులకు హెచ్‌ఐవీ సోకినట్లు అధ్యయనంలో పేర్కొంది.

డేటింగ్‌తో జరభద్రం

హెచ్‌ఐవీ నిర్మూలనకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, ఇలాంటి వెబ్‌సైట్లు మాత్రం మొత్తం వ్యవస్ధనే మార్చేస్తున్నాయని, ఈ శృంగార విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ తెలిపారు.

డేటింగ్‌తో జరభద్రం

చట్టవిరుద్ధంగా నడుస్తున్న వందకు పైగా వెబ్‌సైట్‌లను చైనా ప్రభుత్వం నిలిపివేసింది. మరో ఇరవై వెబ్‌సైట్‌లను పద్ధతి మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. చైనా ప్రభుత్వం దాదాపు 128 వెబ్‌సైట్లను నిలిపివేసింది.

డేటింగ్‌తో జరభద్రం

వ్యక్తిగత సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగపరుస్తున్న, అశ్లీల దృశ్యాలు, సమాచారాన్ని ఉంచుతున్న వెబ్‌సైట్‌లను నిలిపివేసినట్లు చైనా ఇంటర్నెట్ నిఘా సంస్థ వెల్లడించింది.

డేటింగ్‌తో జరభద్రం

కొన్ని వెబ్‌సైట్‌లు రిజిస్టర్డ్ యూజర్స్ పోర్నోగ్రాఫిక్ నావెల్స్ పబ్లిష్ చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఫ్రాడ్, ప్రాస్టిట్యూషన్, మోసపూరిత పద్ధతులు ఉండకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగా వాటిని నిలిపివేశారు.

డేటింగ్‌తో జరభద్రం

డేటింగ్ పేరుతో ఇంటర్ నెట్ వేశ్యాగృహాలకు అడ్డాగా మారుతోంది. యువతలోని మానసిక బలహీనతలను సోమ్ము చేసుకుంటున్నాయి ఈ వెబ్ సైట్లు. వేలాది మంది ఇలాంటి సైట్లను నమ్మి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

డేటింగ్‌తో జరభద్రం

డేటింగ్‌తో జరభద్రం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ashley Madison, is giving sleepless nights to Indians Also. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot