ఆసియాలో టాప్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్

Posted By: Staff

ఆసియాలో టాప్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కుమ మంది వాడే సాధనం ఇంటర్నెట్. ఇంటర్నెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్నెట్ వల్ల సోషల్ మీడియా కూడా బాగా అభివృద్ది చెందిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అలాంటి సోషల్ మీడియా అలవాట్లు ఆసియాలో ఏవిధంగా ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం ఎండెల్మెన్ డిజిటల్ అనే సంస్ద గ్రాఫికల్‌గా ఎలా ఉంటుందో మనతో పంచుకుంది.

ఈ మ్యాప్‌లో సోషల్ మీడియా రంగంలో ఫేస్‌బుక్ ఏవిధంగా తన ఆధి పత్యాన్ని చూపిస్తుందో స్పష్టంగా చూపించారు. మొత్తం 13దేశాలలో 9దేశాలకు గాను ఫేస్‌బుక్ తన హావాని కోనసాగిస్తుంది. ఐతే చైనా, సౌత్ కోరియా, తైవాన్ లాంటి దేశాలలో తమ తమ దేశాలకు సంబంధించినటువంటి లోకల్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసులు డామినేట్ చేయడం విశేషం.

ఈ డేటా కామ్ స్కోర్ నుండి తీసుకోవడం జరిగింది. దీని వల్ల ఇంటర్నెట్‌ని వాడుతూ వారియొక్క కంప్యూటర్స్‌ని ఆపరేటింగ్ చేస్తుంటారో వారు మాత్రమే ఇందులోకి వర్తిస్తారు. ఇక ఈ డేటావల్ల మనకు తెలిసిందే ఏమిటంటే చైనాలో సోషల్ నెట్ వర్కింగ్ వాడకం చాలా తక్కువ అని. అంతేకాకుండా చైనా‌లో టాప్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ అయిన సినా వైబోని అక్కడి ప్రజలు మొబైల్స్ ద్వారా కేవలం 50శాతం వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతన్నారు. ఏది ఏతేనైం ఆసియాలో సోషల్ నెట్ వర్కింగ్ యూజర్స్ బాగానే ఉన్నారని అనడానికి ఈ మ్యాపే నిదర్శనం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot