క్వచ్చన్ అడగండి, లైవ్ ఫేస్‌బుక్ పేజి ద్వారా ఒబామా నుండి సమాధానం..

By Super
|
క్వచ్చన్ అడగండి, లైవ్ ఫేస్‌బుక్ పేజి ద్వారా ఒబామా నుండి సమాధానం..
న్యూయార్క్: బరాక్ ఒబామా..ప్రపంచంలో ఈపేరు వినని వారు ఉండరంటే నమ్మండి. అగ్రరాజ్యానికి అధిపతి. ఎప్పుడూ తన దేశ ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అలాంటి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఏప్రిల్ 20వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌లో లైవ్ అప్ఫీరియన్స్ ఇవ్వనున్నారు. దీనికి ఒబామా పెట్టినటువంటి పేరు "దేశంలో ఉన్నటువంటి అందరి అమెరికన్స్‌తో ముఖాముఖి".

ఈ విషయాన్ని వైట్ హౌస్ మరియు ఫేస్‌బుక్ ప్రతినిధులు ధృవీకరించారు. ఒబామా టౌన్‌హాల్ మీటింగ్ ఆన్ ఫేస్‌బుక్ కార్యాక్రమాన్ని యావత్ దేశం మొత్తం వీక్షించేవిధంగా పేస్‌బు‌క్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లైవ్ కార్యక్రమంలో ఒబామా అమెరికా ఎకనామిక్ స్టేటస్ గురించి ఆదేశంలో ఉన్నటువంటి జనాభాతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి లీడర్స్‌లో ఒబామా టెక్నాలజీని వాడి తన దేశ ప్రజలకు దగ్గరవ్వడంలో తనదైన ముద్రని వేశారు.

 

ఇది ఎలాగంటే ఒబామా తన ప్రెసిడెంటల్ క్యాంపెయిన్స్ నిర్వహించినప్పుడు సోసైటీలో ఉన్న ప్రజలను ఆకర్షించడంలో ఒబామా వాడినటువంటి సాధనం ట్విట్టర్. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఒబామా ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ ద్వారా రీ-ఎలక్షన్ క్యాంపెయిన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఒబామా ఏప్రిల్ 20వ తారీఖున కనిపించనున్నటువంటి లైవ్ అప్రీరియన్స్‌లో ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్‌తో పాటు, సివోవో శాండ్ బర్గ్ కూడా పాల్గోనున్నారు.

ఇక ఈకార్యక్రమంలో ఎవరైనా ఒబామాని ప్రశ్నించదలచుకుంటే వారి యొక్క క్వచ్చన్స్‌ని ఇందులో WhiteHouse.gov/facebooktownhall పోందుపరచాలని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ అడిగినటువంటి క్వచ్చన్స్ నుండి సెలెక్టెడ్ క్వచ్చన్స్ కి ప్రెసిడెంట్ ఒబామా సమాధానాలు ఇస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం ఫేస్‌బుక్ ప్రత్యేకంగా ఓ పేజిని క్రియేటే చేసింది. దాని గురించిన సమాచారం ప్రెసిడెంట్ ఒబామా ఫేస్ బుక్ టౌన్ హాల్ పేజి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X