ఫేస్‌బుక్ ఓ పెద్ద గూఢచారి మెషిన్: వికిలీక్స్ వ్యవస్దాపకుడు అసాంజ్

Posted By: Staff

ఫేస్‌బుక్ ఓ పెద్ద గూఢచారి మెషిన్: వికిలీక్స్ వ్యవస్దాపకుడు అసాంజ్

వికీలీక్స్ వ్యవస్దాపకుడు జూలియన్ అసాంజ్ రష్యన్ టుడే‌కి ఇచ్చిన ఇంటర్యూలో ప్రపంచంలో కెల్లా ఫేస్‌బుక్‌ని మోస్ట్ అప్పీలింగ్ గూఢచారి మెషిన్‌గా అభివర్ణించడం జరిగింది. రష్యన్ టుడే విలేకరి లారా ఎమిట్‌తో నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జనాభా గురించిన డేటాబేస్ ముఖ్యంగా రిలేషన్ షిప్స్, పేర్లు, అడ్రస్, కమ్యూనికేషన్స్, స్నేహితులు గురించిన సమాచారం అంతా ఫేస్ బుక్ మెయింటేన్ చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని యుయస్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉంది.

మార్చి నెలలో అసాంజ్ కేంబ్రిడ్జి యూనివర్సటీ స్టూడెంట్స్‌తో ఇంటర్నెట్ అనేది ఓ పెద్ద గూఢచారి మెషిన్ లాంటిదని అన్నారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, గూగుల్, యాహూ సంస్దలు యుయస్ ఇంటిలిజెన్స్‌కు ప్రత్యేకంగా ఆటోమెటెడ్ ఇంటర్‌ఫేస్‌లకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాయని అన్నారు.
మీరు ఎప్పుడైతే మీ స్నేహితులను యాడ్ చేసుకుంటారో ఆ సమయంలో వారి గురించిన సమాచారం మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీస్‌కు ఫ్రీగా చేరవేస్తున్నాయని ఆరోపించారు.

ఐతే ఈ వెబ్‌సైట్స్‌ని గవర్నమెంట్ మాత్రం నడపడం లేదని అన్నారు. కానీ ఇంటిలిజెన్స్ కమ్యూటికీ చెందిన కొందరు అధికారులు మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot