Psyche 16 :ఈ ఒక్క గ్రహశకలంతో అందరూ కోటీశ్వరులవుతారు

By Gizbot Bureau
|

ఖగాళ శాస్త్రంలో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. దీనికి నాసా రిపోర్ట్ వేదికగా నిలవనుంది. ఈ భూమిపై ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తుడిచిపెట్టేందుకు వనరులు పుష్కలంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని నాసా కనుగొంది. ఈ గ్రహశకలం ద్వారా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కోటీశ్వరలు కావచ్చట.

Psyche 16 :ఈ ఒక్క గ్రహశకలంతో అందరూ కోటీశ్వరులవుతారు

 

ఆశ్యర్యపోతున్నారా.. అవును నాసా ప్రతి ఒక్కరినీ బిలీనియర్‌గా మార్చగల బంగారు గ్రహశకలాన్ని ఖగోళంలో కనుగొంది. దీనికి Psyche 16 అని పేరు పెట్టారు. ఇది అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య, భూమికి 750 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో తిరుగుతోందని నాసా ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

Psyche 16

Psyche 16

1852 లో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబాలే డి గ్యాస్పారిస్ ఈ Psyche 16ని కనుగొన్నారు. ఈ గ్రహశకలం అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్ష్యల మధ్య పయనిస్తోందని తెలిపారు. సౌర వ్యవస్థ ఏర్పడేటప్పుడు హింసాత్మక ఘర్షణ సమయంలో ఇది ఏర్పడిందని వారు నమ్ముతున్నారు. ఈ గ్రహశకలం gold, platinum, iron and nickel వంటి నిక్షేపాలతో ఈ గ్రహశకలం నిండి ఉందని దీని విలువ దాదాపు £ 8,000 క్వాడ్రిలియన్ (£8,000,000,000,000,000,000) గా ఉందని ది సన్ నివేదించింది. 1 క్వాలిడ్రియన్ విలువ క్యూబ్ ప్రకారం Ten trillion, six hundred seventy million, eight hundred eighty-three thousand, eight hundred and forty dollars and zero cents కన్నా ఎక్కువ. అంటే దాదాపు ట్రిలియన్ డాలర్ల కన్నా వేయి రెట్లు ఎక్కువగా చెప్పుకోవాలి.

2022 సంవత్సరానికి..

2022 సంవత్సరానికి..

అయితే ఈ గ్రహశకలాన్నిఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. 2022 సంవత్సరానికంతా దీని కచ్చిత గమనాన్ని కనుగొంటామని నాసా ప్రకటించింది. అయితే బంగారాన్ని అంతరిక్షం నుంచి తీయడం సాధ్యమేనా మన దగ్గర అంత సాంకేతికత ఉందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలి ఉంది. అయినప్పటికీ మున్ముందు ఈ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ అధ్యక్షుడు జాన్‌ జార్నెకీ అంటున్నారు

50 సంవత్సరాలుపై మాటే
 

50 సంవత్సరాలుపై మాటే

అంతరిక్షంలో మన ప్రయాణం సులువుగా సాగడానికి మహా అయితే ఓ 25 సంవత్సారాలు పట్టొచ్చు, అలాగే అంతరిక్షాన్ని కమర్శియల్‌గా ఉపయోగించుకోవడానికి మాత్రం 50 సంవత్సరాలు ఆగాల్సిందేనని చెప్పారు. అంతరిక్షాన్ని ఆర్థిక వెసులుబాటు, స్పేస్‌ టెక్నాలజీ ఈ రెండింటి కొరకే మనం వాడుకుంటామని ఆయన అన్నారు. అలాగే ఈ ప్రపంచంలో మనం కేవలం ఒంటరి కాదు. ఇంకా మనకు తెలియని ఎన్నో శక్తులు ఈ అంతరిక్షంలో ఆదిపత్యానికి అడ్డురావచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడ మనం చేస్తున్నదంతా గ్రౌండ్‌వర్క్‌ మాత్రమే. సరైన మౌళిక సదుపాయాలు ఉంటే కచ్చితంగా సాధించి తీరుతామని అంటున్నారు.

అంతరిక్ష మైనింగ్‌ మార్కెట్‌

అంతరిక్ష మైనింగ్‌ మార్కెట్‌

సైచీ-16 గ్రహశకలాన్ని అందుకుంటే అంతరిక్షంలో బంగారు అన్వేషనకు ఇదే మొదటి దశ అవుతుంది. అలాగే భూమికి దగ్గరగా వెళ్లే గ్రహశకలాలలో కూడా ఇతర ఖనిజాలను వెలికితీయవచ్చు. ముఖ్యంగా అరుదైన లోహాల వనరులను కలిగి ఉన్న చంద్రుడు తదుపరి అంతరిక్ష మైనింగ్ కార్యకలాపాలకు ప్రధానకేంద్రం అవుతాడు. ఇప్పటికే అంతరిక్ష మైనింగ్‌ మార్కెట్‌ ఏర్పడింది. భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. మైనింగ్‌కు అనుగుణంగా స్పేస్‌క్రాఫ్ట్‌లను డిజైన్‌ చేయడంపై తలమునకలై ఉన్నారు.

350 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు

350 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ సెగ్మెంట్‌లో ఖర్చు సగానికి సగం తగ్గితేనే అంతరిక్షంలో పెట్టుబడులకు బడా కంపెనీలు ముందుకు వస్తాయి. అంతరిక్ష మైనింగ్‌ అనేది 25-50 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా జరగొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పెట్టుబడులు కోసం అన్వేషణలు మొదలయ్యాయి. మోర్గాన్‌ స్టాన్లీ అంచనా ప్రకారం 350 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. 2040 నాటికి ఈ సంఖ్య 2.7 ట్రిలియన్స్‌కు చేరుకోవచ్చు. అయితే బడా కంపెనీలను ఈ దిశగా ఉత్సాహ పరిచి అడుగులు వేయడానికి సైచీ-16 మరింత కీలకంగా మారనుంది.

 ఏ దేశాలు ముందు వరసలో ఉన్నాయి.

ఏ దేశాలు ముందు వరసలో ఉన్నాయి.

ప్రపంచ శక్తిగా మారుతున్న చైనా ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసింది. అమెరికా కంటే ముందు దూసుకుపోతోంది. ఇక అమెరికా కూడా అత్యంత రహస్యంగా తన ప్రయోగాలను చేస్తోంది. సాకు ప్రస్తుతం అంతరిక్ష అన్వేషణ, సైంటిఫిక్‌ మిషన్స్‌పైనే ఆలోచన ఉండగా చైనా మాత్రం అంతరిక్ష వాణిజ్య వ్యాపారంపైనే దృష్టి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఇక యూరపియన్‌ యూనియన్‌ కూడా ఈ రేసులో ఉంది.

 యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఒప్పందం

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఒప్పందం

2025 సంవత్సరానికంతా చంద్రునిపై మైనింగ్‌ మొదలు పెట్టాలని యూరోసన్‌ అనే దిగ్గజ గోల్డ్‌మైనింగ్‌ ఏజెన్సీతో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అతి చిన్నదేశమైన లక్సెంబర్గ్‌లో అంతరిక్షంలో మైనింగ్‌కోసం ఏకంగా10 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. జపాన్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ లూనార్‌ ఆర్బిట్‌ని 2020 సంవత్సరానికి సిద్ధం చెస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
NASA shock: Giant golden asteroid could wipe out ENTIRE global economy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more