ప్లూటోపై పాముచర్మంలాంటి పర్వతాలు

Written By:

ప్లూటోపై పాములాంటి పర్వతాలు ఉన్నాయా.. పాము చర్మాన్ని పోలిన పర్వతాలు ప్లూటో పర్వతంపై కనువిందు చేస్తున్నాయా..పొరలు పొరలుగా అలలు అలలుగా పర్వతాలు అక్కడ పాతుకుని పోయాయా..అంటే అవుననే అంటోంది నాసా..ప్లూటోపై పర్వతాలు పాములులాగా ఉన్నాయని ఇవి శాస్ర్తవేత్తలను షాకింగ్ కు గురిచేస్తున్నాయని నాసా చెబుతోంది.ప్లూటోని జల్లెడ పడుతున్న నాసా వ్యోమనౌక న్యూహారిజోన్స్ ఇటీవల తీసిన చిత్రాలు భూమిమీదకు చేరాయి..అవి ఎలా ఉన్నాయో కింది స్లైడర్ లో చూడండి.

Read more: ప్లూటోపై పర్వతాలు,పొగమంచు మైదానాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యధిక రెజల్యూషన్ తో కూడిన చిత్రాలు

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన న్యూహారిజోన్స్ వ్యోమనౌక ప్లూటో గ్రహానికి సంబంధించి తాజాగా పంపిన అత్యధిక రెజల్యూషన్ తో కూడిన చిత్రాలు ఖగోళ శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

అచ్చం పాము చర్మంలా..

ఈ చిత్రాన్ని చూస్తే అచ్చం పాము చర్మంలా కనిపిస్తుంది కదా. కానీ ఇది ఫ్లూటో ఉపరితల చిత్రం. దీనిని న్యూహారిజన్ అంతరిక్ష నౌక ఇటీవల తీసి నాసా కేంద్రానికి చేరవేసింది. పాము చర్మాన్ని పోలివున్న ఫ్లూటో ఉపరితల చిత్రాలు న్యూహారిజన్ బృందాన్నే కాకుండా నాసా శాస్త్రవేత్తల్ని కూడా సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి.

పొరలుగా.. అలల మాదిరిగా..

పొరలుగా.. అలల మాదిరిగా, గుట్టలుగా కనిపించే ఫ్లూటో భూభాగానికి సంబంధించిన చిత్రాలు అద్భుతంగానూ, మిస్టరీగా ఉన్నాయని నాసా పేర్కొన్నది. ఈ చిత్రంలోని ప్లూటో పై పర్వతాలు పాము చర్మం ఆకృతిని దాల్చి ఉన్నట్లు నాసా తెలిపింది.

నీలం గోధుమ రంగుల్లో మిట్టలు

దీంతో పాటు చిత్రమైన ఆకారాల్లో నీలం గోధుమ రంగుల్లో మిట్టలు ఉన్నట్లు ఈ కలర్ ఫోటో స్పష్టం చేస్తోందని న్యూ హారిజాన్స్ జియోలజి,జియోఫిజిక్స్ అండ్ ఇమేజింగ్ బృందానికి డిప్యూటీ హెడ్ అయిన విలియమ్ మెకినన్ తెలిపారు.

530 కిలోమీటర్ల మేర ..

మల్టీస్పెక్టల్ విజువల్ కెమెరా ద్వారా సుమారు 530 కిలోమీటర్ల మేర ప్లూటో ఉపరితల ప్రాంతాన్ని జూలై 14న న్యూహారాజాన్స్ వ్యోమనౌక చిత్రీకరించిందని చెప్పారు.

సెప్టెంబర్ 20న భూమికి..

దీంతో లాంగ్ రేంజ్ రీకనెసైన్స్ ఇమేజర్ ద్వారా తీసిన చిత్రం సెప్టెంబర్ 20న భూమికి చేరిందని ప్లూటో భౌగోళిక వివరాలు ఇది స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు.

ప్లూటో ఉపరితలంపై మిథేన్‌ ఐస్‌

నాసా న్యూ హారిజన్‌ అంతరిక్ష నౌక నుంచి ప్లూటో ఉపగ్రహానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాలు పలు కీలకమైన, నూతన అంశాలను వెల్లడించింది. ప్లూటో ఉపరితలంపై మిథేన్‌ ఐస్‌ ఉన్నట్లు కూడా గమనించారు.

మానవులు నివసించేందుకు అనువైన వాతావరణం

ఈ ప్లూటో పై మానవులు నివసించేందుకు అనువైన వాతావరణం కూడా ఉందని నాసా చెబుతోంది.

 

 

పర్వతశ్రేణులు 11 వేల అడుగుల ఎత్తు ఉంటాయని అంచనా

పర్వతశ్రేణులు 11 వేల అడుగుల ఎత్తు ఉంటాయని అంచనా

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pluto's a whole new world: Incredible new high-resolution colour images reveal strange 'animal skin' terrain on dwarf planet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot