ఆకాశానికి మెట్ల మీద నుంచి నడిచిపొవచ్చట,శాస్త్రవేత్తల కొత్త ఆలోచన

By Gizbot Bureau
|

అప్పుడెప్పుడో 1972 సంవత్సరంలో వచ్చిన బాల భారతం సినిమా ఎవరికైనా గుర్తుందా.. గుర్తు ఉంటే అందులో ఓ సీన్ ఉంటుంది. కురు పాండవుల యుద్ధంలో భీముడు ఆకాశంలోకి వెళ్లడానికి అర్జునుడు తన బాణాలతో నిచ్చెన తయారుచేస్తాడు.. ఆ నిచ్చెన మెట్లు ఎక్కి భీముడు ఆకాశంలోకి వెళతాడు.. ఇప్పుడు అదే సీన్ మనకు రియల్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి కార్యక్రమానికి పరిశోధకులు శ్రీకారం చుట్టారు. ఆకాశానాకి నిచ్చెన వేసేందుకు రెడీ అయ్యారు. శాస్ర్తవేత్తలు Space Elevator Designలో తలమునకలయ్యారు.

చందమామ నుంచి వేలాడుతూ

కొలంబియా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్‌ ఎలివేటర్‌ నిర్మాణానికి వినూత్న ప్రతిపాదన చేశారు. నిచ్చెన భూమ్మీది నుంచి కాకుండా చందమామ నుంచి వేలాడుతూ ఉండటం ఈ తాజా ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఇప్పుడు ఆలోచనకు మాత్రమే పరిమితమైంది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టవచ్చు. 

చందమామ నుంచి వేలాడుతూ

కొలంబియా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్‌ ఎలివేటర్‌ నిర్మాణానికి వినూత్న ప్రతిపాదన చేశారు. నిచ్చెన భూమ్మీది నుంచి కాకుండా చందమామ నుంచి వేలాడుతూ ఉండటం ఈ తాజా ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఇప్పుడు ఆలోచనకు మాత్రమే పరిమితమైంది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టవచ్చు.

శాస్త్రవేత్తల ప్రతిపాదన ప్రకారం చందమామపై బలమైన తీగ లాంటిదాన్ని బిగించి దాన్ని భూస్థిర కక్ష్య వరకు వేలాడేలా చేస్తారు. భూమ్మీది నుంచి వెళ్లే రాకెట్లు ఈ తీగ సహాయంతో కొనకు చేరుకుంటాయి. అక్కడే పార్క్‌ అవుతాయి. ఆ తర్వాత వ్యోమగాములు ఈ తీగ వెంబడి ఇంకో రాకెట్‌లో పయనించి సులువుగా జాబిల్లిని చేరుకుంటారు.

సౌరశక్తితో అక్కడికక్కడే ఉత్పత్తి 

అంతరిక్షంలో ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ జాంలు ఉండవు కాబట్టి. ఈ ప్రయోగం ద్వారా తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పైగా ఈ శక్తిని కూడా సౌరశక్తితో అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలు, పదార్థాలు అందుబాటులోనే ఉన్నాయని జెఫైర్‌ పెనైరీ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు జాబిల్లిపై మకాం పెట్టాలని ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌ మస్క్‌ వంటివాళ్లు ఇంకో నాలుగేళ్లలో అంగారకుడిపై కాలనీ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఇలాంటి నిచ్చెన అనేది అవసరమవుతుంది.

స్పేస్‌లైన్‌ కీలకమైన నిర్మాణం

ఈ ప్రయోగం ద్వారా అతితక్కువ ఖర్చుతో వ్యోమగాములను జాబిల్లికి చేర్చడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వెళ్లేందుకు కూడా స్పేస్‌లైన్‌ కీలకమైన నిర్మాణం కానుందని శాస్ర్తవేత్తలు వివరించారు. భవిష్యత్తులో ఈ స్పేస్‌లైన్‌ నిర్మాణమంటూ జరిగితే దాన్ని టెలిస్కోపులు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వాడుకోవచ్చని జెఫైర్‌ అంటు న్నారు.

Best Mobiles in India

English summary
Astronomers Have Another Space Elevator Design

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X