Home
News

ఢిల్లీ హైకోర్టు దెబ్బకు Asus 6Zగా పేరు మార్చుకున్న ZenFone 6

By Gizbot Bureau

తైవాన్ దిగ్గజం అసుస్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ZenFone 6ని ఇండియాలోకి తీసుకురానుంది. కాగా ఈ ఫోన్ పేరు మార్చుకుని Asus 6Zగా ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో ఈ ఫోన్ కి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమైంది.కాగా గత వారం ఢీల్లీ హైకోర్టు Zen or ZenFone-branded products మీద నిషేధం విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఢిల్లీ హైకోర్టు దెబ్బకు Asus 6Zగా పేరు మార్చుకున్న ZenFone 6

ట్రేడ్ మార్క్ ఉల్లంఘన కేసులో భాగంగా ఈ ఫోన్ల ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు కోర్టు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు పేరు మార్చుకుని సరికొత్తగా ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే మీడియాకు కంపెనీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఈ కామర్స్ సైట్ Flipkartలో సైతం అప్ డేట్ ఇచ్చింది. Asus 6Z ఈ నెల 19న మార్కెట్లోకి వస్తుందటూ ఓ ప్రకటనను ఉంచింది. కాగా Asus 6Z ఫీచర్లు అన్నీ ZenFone 6లో ఉన్నవేనని తెలుస్తోంది.

  టెలికేర్ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్:

టెలికేర్ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్:

ఆసుస్ టెక్నాలజీ ప్రెవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కు వ్యతిరేకంగా టెలికేర్ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దాఖలు చేసిన దావా ఫైల్ ఆదారంగా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ మన్మోహన్ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ దాఖలులో ఆసుస్ కంపెనీ యాజమాన్యంలో ట్రేడ్మార్క్ ను ఉల్లంఘించిందని ఆరోపించింది.ట్రేడ్మార్క్ లో జెన్ మరియు జెన్ఫోన్ లు ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 క్రింద ఉల్లంఘనకు పాల్పడినట్లు టెలికేర్ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాఖ్యానించింది.బార్ మరియు బెంచ్ ప్రకారం జేన్ బ్రాండ్ 2008 కింద కంపెనీ ఫీచర్ ఫోన్లు ,స్మార్ట్ ఫోన్లు,టాబ్లెట్స్ మరియు ఇతర డివైస్ల కోసం ఈ ట్రేడ్మార్క్లను విస్తృతంగా ఉపయోగించింది. అయితే దీనిపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూఆ బ్రాండ్ ని నిషేధించింది.

జెన్‌ఫోన్ 6 ను స్పెయిన్ మార్కెట్‌లో

జెన్‌ఫోన్ 6 ను స్పెయిన్ మార్కెట్‌లో

కాగా అసుస్ కంపెనీ ఇప్పటికే నూత‌న స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను స్పెయిన్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.46 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. ఈ ఫోన్ వెనుక భాగానికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

  అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు

6.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 అసుస్ జెన్‌ఫోన్ 6 ధరలు

అసుస్ జెన్‌ఫోన్ 6 ధరలు

అసుస్ జెన్‌ఫోన్ 6 స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, ట్విలైట్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,132 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. అలాగే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,800 ధ‌రకు, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,970 ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. మే 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

  Asus 6Z ఫీచర్లు

Asus 6Z ఫీచర్లు

ఇప్పుడు ఇవే ఫీచర్లు ధరలతో ఈ ఫోన్ Asus 6Z గా పేరు మార్చుకుని ఇండియాకు ఈనెల 19న వస్తోంది. ఈ ఫోన్లో కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 48-megapixel primary shooter with f/1.79 apertureతో పాటుగా 13-megapixel secondary ultra-wide-angle cameraను పొందుపరిచారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Asus ZenFone 6 to Launch in India as Asus 6Z on June 19, Company Confirms
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X