Asus 8z స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ఆసూస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నేడు ఇండియాలో ఆసూస్ 8z కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త అసూస్ ఫోన్ గత సంవత్సరం జెన్ఫోనే 8 గా యూరప్ మరియు తైవాన్‌లలో ప్రారంభించబడింది. ఇది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. 6-అంగుళాల స్క్రీన్‌లను కలిగి ఉన్న సాధారణ ఫ్లాగ్‌షిప్‌లతో పోల్చినప్పుడు ఇది 5.9-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఆసుస్ 8z ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC, OZO ఆడియో జూమ్‌తో పాటు ట్రిపుల్ మైక్రోఫోన్‌లు మరియు వీడియో రికార్డింగ్‌ల సమయంలో పరిసరప్రాంతంలోని శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడే యాజమాన్య నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇండియా మార్కెట్ లో షియామి11T ప్రో, సాంసంగ్ గెలాక్సీ S20 FE 5G మరియు వన్ ప్లస్ 9RT లకు పోటీగా లాంచ్ అయ్యే ఈ కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ ధర & లభ్యత వివరాలు

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో Asus 8z స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.42,999. ఈ ఫోన్ హారిజోన్ సిల్వర్ మరియు అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభించింది. ఇండియా మార్కెట్ లో ఈ ఫోన్ మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటిసారి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది Asus ZenFone 8 జెన్‌ఫోన్ 8 ఫ్లిప్‌తో పాటు అంతర్జాతీయంగా గత సంవత్సరం ప్రారంభించబడింది. అయితే రెండోది భారతదేశంలో లాంచ్ అవ్వడం లేదు. ఆసుస్ 8z లాంచ్ వాస్తవానికి గత సంవత్సరంలో ప్లాన్ చేయబడింది. అయితే కోవిడ్-19 యొక్క రెండవ వేవ్ ఆవిర్భావం మరియు సరఫరా గొలుసు పరిమితుల కారణంగా ప్రకటనను ఆలస్యం చేయాల్సి వచ్చిందని ఆసుస్ తెలిపింది.

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్
 

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై ZenUI 8తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 5.9-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) సాంసంగ్ E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా కూడా రక్షించబడుతుంది. హుడ్ కింద ఈ ఫోన్ 8GB LPDDR5 RAMతో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoCని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 64-మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్, f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సోనీ IMX363 సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సోనీ IMX663 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ ఫేజ్-డిటెక్షన్ ఆటోఫోకస్ లెన్స్ ఉంది.

స్టోరేజ్‌

Asus 8z స్మార్ట్‌ఫోన్‌ 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది NTFS ఫార్మాట్ ద్వారా HDD ద్వారా విస్తరణకు మద్దతు ఇస్తుంది. అయితే ఇది మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించదగిన స్టోరేజ్ కు మద్దతు ఇవ్వదు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS/ NavIC, NFC, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తో పాటుగా ఫోన్ స్టీరియో స్పీకర్లు మరియు ట్రిపుల్ మైక్రోఫోన్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు క్విక్ ఛార్జ్ 4.0 మరియు పవర్ డెలివరీ సపోర్ట్‌ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది IP68-సర్టిఫైడ్ బిల్డ్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 148x68.5x8.9mm కొలతల పరిమాణంలో ఉండి 169 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Asus 8z Smartphone Launched in India With Snapdragon 888 SoC: Price, Specs, Sales Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X