రూ.10,000 భారీ ధర తగ్గింపును అందుకున్న Asus ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆసుస్ యొక్క తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్- ROG ఫోన్ 5 ను ఇటీవల ఇండియాలో విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఫోన్ లాంచ్ తరువాత కంపెనీ గత సంవత్సరంలో ఇండియాలో లాంచ్ చేసిన ROG ఫోన్ 3 యొక్క ధరను తగ్గించింది. ROG ఫోన్ 3 ధర తగ్గింపును అందుకోవడం ఇండియాలో ఇది రెండవసారి. గత ఏడాది ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను రూ.3,000లకు తగ్గించింది.

 

ఆసుస్ ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త తగ్గింపు ధరలు

ఆసుస్ ROG గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త తగ్గింపు ధరలు

8GB, 12GB ర్యామ్ వేరియంట్ల లభించే ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను కంపెనీ ఇప్పుడు మళ్ళీ తగ్గించింది. ఇందులో భాగంగా 8GB ర్యామ్ వెర్షన్ యొక్క ధరను రూ.5000 వరకు తగ్గించారు. ఇంతకుముందు రూ.45,999 ధర వద్ద లభించే 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.41,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు 12GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వెర్షన్ మీద రూ.10,000 వరకు ధర తగ్గింపును పొందిన తరువాత వినియోగదారులు ఇప్పుడు దీనిని రూ.45,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఆసుస్ ROG ఫోన్ 3 స్పెసిఫికేషన్స్
 

ఆసుస్ ROG ఫోన్ 3 స్పెసిఫికేషన్స్

ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 6.59-అంగుళాల AMOLED స్క్రీన్‌ను 1080 × 2340 పిక్సెల్‌ల FHD + రిజల్యూషన్‌ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది RGB బ్యాక్ ప్యానెల్ కలిగి ఉండడమే కాకుండా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC చిప్ సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ఇమేజింగ్ విషయంలో ROG ఫోన్ 3 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుకవైపున గల కెమెరాలలో 64 మెగాపిక్సెల్ షూటర్‌ మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డీప్ లెన్స్‌ కెమెరాలతో జత చేయబడి వస్తుంది.

ఆసుస్ ROG ఫోన్ 3 సెన్సార్ ఎంపికలు

ఆసుస్ ROG ఫోన్ 3 సెన్సార్ ఎంపికలు

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10-ఆధారిత ROG UI తో రన్ అవుతుంది. ఇందులో ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు. ఇది ఆసుస్ యాక్సిలరేటర్, దిక్సూచి, సామీప్య సెన్సార్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎయిర్‌ట్రిగ్గర్ 3 కోసం అల్ట్రాసోనిక్ సెన్సార్లను కలిగి ఉంది.ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే 5G సపోర్ట్, జివిఎస్ విత్ నావిక్, బ్లూటూత్ వి 5.1, వై-ఫై 6, ఎన్‌ఎఫ్‌సి మరియు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ దిగువన USB టైప్-సి పోర్ట్ మరియు క్వాడ్-మైక్రోఫోన్ సెటప్‌తో హై-రెస్ ఆడియోకు మద్దతు ఇస్తుంది. చివరగా ఇది 600mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Asus ROG Phone 3 Gaming Smartphone Price Slashed One More Time in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X