Home
News

Asus ROG Phone 3 Launch : మెరుగైన ఫీచర్లతో ఆసుస్ కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్ త్వరలోనే...

స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆసుస్ సంస్థ తన అభిమానుల కోసం మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేస్తున్నది. ఆసుస్ ROG ఫోన్ 3 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ జూలై 22 న జరుగుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఆసుస్ ROG ఫోన్ 3 లాంచ్

ఆసుస్ ROG ఫోన్ 3 లాంచ్

ఇదే రోజు ఈ ఫోన్ ఇండియాలో కూడా అరంగేట్రం చేస్తుంది అని కూడా తెలిపారు. ఆసుస్ ROG స్మార్ట్‌ఫోన్‌ కొత్త తరం గేమింగ్ ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది అని ఆసుస్ వెల్లడించింది. ఈ ఫోన్ 16GB ర్యామ్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆసుస్ ROG ఫోన్ 2 యొక్క అప్‌డేట్ వెర్షన్ గా వస్తున్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆసుస్ ROG ఫోన్ 3 ఈవెంట్ లాంచ్ వివరాలు

ఆసుస్ ROG ఫోన్ 3 ఈవెంట్ లాంచ్ వివరాలు

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ యొక్క లాంచ్ ఈవెంట్ జూలై 22 న రాత్రి 8:15 గంటల సమయంకి ప్రారంభమవుతుంది. ప్రజలు లాంచ్ ఈవెంట్‌ను ఆసుస్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. ఇండియాతో పాటు యుఎస్ మరియు యూరోపియన్ మార్కెట్లలో కూడా ఈ ఫోన్ ను ఒకే సారి లాంచ్ చేస్తున్నారు.

ఆసుస్ ROG ఫోన్ 3 సాఫ్ట్ వెర్

ఆసుస్ ROG ఫోన్ 3 సాఫ్ట్ వెర్

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC ను కలిగి ఉండి శక్తిని ఇస్తుంది. ఈ కొత్త క్వాల్కమ్ మొబైల్ ప్రాసెసర్ 5G కనెక్టివిటీకి మద్దతును ఇస్తుంది. దీనితో పాటుగా అల్ట్రా-ఇంటూటివ్ AI, వై-ఫై 6E , బ్లూటూత్ 5.2 వంటి మరిన్ని ఫీచర్ల మద్దతును కూడా అందిస్తుంది. దీని యొక్క CPU మరియు GPU పనితీరు కూడా మునుపటి తరం స్నాప్‌డ్రాగన్ 865 తో పోలిస్తే 10 శాతం మెరుగ్గా ఉంటుంది. దీని యొక్క CPU కోర్ 3.1GHz వరకు గడియార వేగంతో పనిచేస్తుంది.

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

లీక్ అయిన సమాచారం ప్రకారం ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల AMOLED డిస్ప్లే 1,080x2,340 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ వద్ద ఉంది. ఇది 8GB, 12GB, మరియు 16GB ర్యామ్ మరియు 128GB, 256GB మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వంటి మూడు వేరియంట్లతో లాంచ్ అవుతుంది.

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ తో మరియు 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. ఆసుస్ ROG ఫోన్ 2 మాదిరిగానే ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు పుకారు ఉంది. ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క ఇతర పుకార్లలో ఇది ఆండ్రాయిడ్ 10, 5G సపోర్ట్ మరియు డ్యూయల్ USB టైప్-సి పోర్టులను కలిగి ఉన్నాయి. ఈ ఆసుస్ ROG ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ 171x78x9.85mm కొలతలతో 240 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Asus ROG Phone 3 Smartphone Launch on July 22 in India: Price, Specs Expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X