Home
News

16GB RAM తో గేమింగ్ ఫోన్, ఇండియాలో లాంచ్! ధర, స్పెసిఫికేషన్లు & సేల్ వివరాలు

By Maheswara

ఆసుస్ ఎట్టకేలకు భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శక్తివంతమైన గేమింగ్ ఫోన్ ROG ఫోన్ 7 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో రెండు మోడల్‌లు ఉన్నాయి. అసూస్ ROG ఫోన్ 7 మరియు ఆసుస్ ROG ఫోన్ 7 అల్టిమేట్. ఈ ఫోన్లు వివిధ లీక్‌లు మరియు నివేదికల ద్వారా టెక్ ఔత్సాహికులలో ఉత్సాహాన్ని పెంచుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు లాంచ్ అయ్యాయి.

ఆసుస్ ROG ఫోన్ 7 సిరీస్ ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించబడింది మరియు అంతరాయం లేని గేమింగ్ అనుభవాన్ని అందించడానికి అధునాతన కూలింగ్ సొల్యూషన్స్‌తో వస్తుంది. ఈ తాజా సిరీస్ జూలై 2022లో విడుదలైన ఆసుస్ ROG ఫోన్ 6 సిరీస్‌కు కొనసాగింపుగా వస్తుంది.

Asus ROG Phone 7 And ROG Phone 7 Ultimate Launched In India. Price,Specifications And Sale Details.

ఆసుస్ ROG ఫోన్ 7, ఆసుస్ ROG ఫోన్ 7 అల్టిమేట్ ఫోన్ల ధరల వివరాలు, ఆసుస్ ROG ఫోన్ 7 ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉంది. గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తోంది. దీని ధర రూ. 74,999 గా ఉంది. అలాగే, ఆసుస్ ROG ఫోన్ 7 అల్టిమేట్, భారీ 16GB RAM మరియు 512GB అంతర్గత నిల్వతో వస్తుంది. దీని ధర రూ.99,999 గా ఉంది. ఈ రెండు వేరియంట్‌లు వినియోగదారులకు మే లో సేల్ కు రానున్నాయి.

ROG ఫోన్ 7 యొక్క బేస్ మరియు అల్టిమేట్ వేరియంట్‌లకు స్టార్మ్ వైట్ కలర్ ఎంపిక అందుబాటులో ఉంది. అదనంగా, బేస్ మోడల్ ప్రత్యేకమైన ఫాంటమ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో వస్తుంది.

ఆసుస్ ROG ఫోన్ 7, ఆసుస్ ROG ఫోన్ 7 అల్టిమేట్ ఫోన్ల స్పెసిఫికేషన్ల వివరాలు,
ఆసుస్ ROG ఫోన్ 7 మరియు ROG ఫోన్ 7 అల్టిమేట్ రెండూ వరుసగా ROG UI మరియు Zen UI ఇంటర్‌ఫేస్‌లతో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే డ్యూయల్ నానో-సిమ్ ఫోన్‌లు. ఈ ఫోన్‌లు అద్భుతమైన 6.78 అంగుళాల పూర్తి HD+ (2448 x 1080) AMOLED డిస్‌ప్లేతో అమర్చబడి ఉంటాయి. రిఫ్రెష్ రేట్ 165Hz మరియు టచ్ శాంప్లింగ్ రేట్ 720Hz. డిస్‌ప్లే గరిష్టంగా 1000నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఆసుస్ ROG ఫోన్ 7 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది అడ్రెనో 740 GPUతో జత చేయబడింది. ఈ ఫోన్‌లు గరిష్టంగా 16GB LPDDR5X RAM మరియు 512GB UFS4.0 వరకు అంతర్గత స్టోరేజీ తో వస్తాయి. వినియోగదారులు తమ డేటాను నిల్వ చేయడానికి మరియు అప్లికేషన్‌లను సజావుగా అమలు చేయడానికి తగినంత స్టోరేజీని అందిస్తాయి.

ఇక కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా వివరాలు గమనిస్తే, ఆసుస్ ROG ఫోన్ 7 మరియు ROG ఫోన్ 7 అల్టిమేట్ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి, ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 8-మెగాపిక్సెల్ మాక్రో ఉన్నాయి. ఇక ముందు సెల్ఫీ మరియు వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

ఆసుస్ ROG ఫోన్ 7 మరియు ROG ఫోన్ 7 అల్టిమేట్ రెండూ కూడా, శక్తివంతమైన 6,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇవి 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. వినియోగదారులు ఎక్కువ సమయం గేమింగ్ ఆడటానికి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు GPS, NFC, బ్లూటూత్ v5.3 మరియు Wi-Fi a/b/g/n/ac/ax వంటి అనేక కనెక్టివిటీ ఎంపికలతో వస్తాయి.

అదనంగా, ఈ హ్యాండ్‌సెట్‌లు IP54 రేటింగ్‌ను కలిగి ఉంటాయి, దుమ్ము మరియు నీటి స్ప్లాష్‌ల నుండి రక్షణను అందిస్తాయి. 173mm x 77mm x 10.3mm కొలతలు మరియు 239 గ్రాముల బరువుతో, ఆసుస్ ROG ఫోన్ 7 సిరీస్ సొగసైనది మరియు కాంపాక్ట్‌గా ఉంటుంది, ఇది హ్యాండిల్ చేయడం మరియు తీసుకెళ్లడం సులభం చేస్తుంది.

Best Mobiles in India

English summary
Asus ROG Phone 7 And ROG Phone 7 Ultimate Launched In India. Price,Specifications And Sale Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X