Asus నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 5500mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా..!
అసుస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8) స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను CES ( Consumer Electronics Show) 2024 జనవరి 9న ఆవిష్కరించనున్నారు. అధికారిక విడుదలకు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వీడియోను ప్రమోట్ చేస్తోంది.
అయితే తాజాగా ఆసుస్ రోగ్ ఫోన్ 8 మరియు రోగ్ ఫోన్ 8 ప్రో స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు 6.78 పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే మరియు 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆసుస్ రోగ్ ఫోన్ 8 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది.

లీకైన వివరాలు ఆధారంగా.. అసుస్ రోగ్ ఫోన్ 8 మరియు రోగ్ ఫోన్ 8 ప్రో బాక్సీ డిజైన్ సహా పంచ్ హోల్ డిస్‌ప్లే మరియు మినిమల్ బెజెల్స్‌తో వస్తాయి. వెర్టికల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ROG Logoతో RGB లైట్లను కలిగి ఉంటాయి. రెబల్ గ్రే రంగులో కనిపించాయి.
Asus ROG ఫోన్ 8, ఫోన్ 8 ప్రో 8 ప్రో స్పెసిఫికేషన్లు : అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ROG UI పైన పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ వర్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. 165Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. మరియు HDR10 ను సపోర్టు చేస్తాయి.

లీక్‌ల ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ఆధారంగా పనిచేస్తుంది. వానిల్లా మోడల్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్ 16GB, 24GB ర్యామ్ మరియు 512GB, 1TB స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. ఆసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 32MP మూడో కెమెరాను కలిగి ఉంటుంది. దాంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే మరో స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు వెల్లడి కాలేదు.
ఈ అసుస్ ఫోన్లు Hi-Res ఆడియో సపోర్టుతో 5 మాగ్నట్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. వైఫై 6E, బ్లూటూత్ 5.3, NFC, 3.5 ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. క్విక్ ఛార్జ్ 5.0 మరియు పీడీ ఛార్జింగ్‌తో కూడిన 5500mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








