Home
News

వీడియో ఎడిటింగ్‌, గేమింగ్‌ ఫోన్ల కోసం చూస్తున్నారా.. 24GB ర్యామ్‌, 1TB స్టోరేజీతో కొత్త స్మార్ట్‌ఫోన్లు..!!

అసూస్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్లకు భారత్‌లో మంచి ఆదరణ దక్కింది. Asus ROG సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల డిజైన్‌ సహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా Asus ROG Phone 8 సిరీస్‌ భారత్‌లో లాంచ్‌ కానుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 9 4:30AM IST కి లైవ్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను సంబంధించి లీక్‌లు సహా ఇతర ప్రకటనతో అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అసూస్‌ సంస్థ కూడా ROG ఫోన్‌ 8 సిరీస్‌కు సంబంధించి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు లీక్‌లు సహా ఇతర మార్గాల ద్వారా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ సిరీస్‌ హ్యాండ్‌సెట్లు మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Asus ROG Phone 8

అసూస్‌ ROG ఫోన్‌ 8 స్పెసిఫికేషన్లు : స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాలు పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే HDR10 సపోర్టు చేస్తుంది. మరియు 1000 నిట్స్‌, బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంటుంది.

ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్లు : దాంతోపాటు ఈ ఫోన్‌ 3 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 12GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ మరియు 24GB ర్యామ్‌ +1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

అసూస్‌ రోగ్‌ ఫోన్‌ 8 కెమెరాలు : కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అదే విధంగా 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. దీనిబట్టి ఫోటోగ్రఫీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసూస్‌ రోగ్‌ ఫోన్‌ 8 స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో లాంచ్‌ అవుతుంది. ఈ చిప్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. వీడియో ఎడిటింగ్‌, గేమింగ్‌కు ఈ ఫోన్ అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 OSతో విడుదల కానుంది. దీంతోపాటు కొన్ని సంవత్సరాలపాటు అండ్రాయిడ్‌ అప్‌డేట్లు, మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

అసూస్‌ రోగ్ ఫోన్ 8 హ్యాండ్‌సెట్‌ క్విక్‌ ఛార్జ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు 5G, USB-C, GPS, Wi-Fi సహా వివిధ కనెక్టివిటీ మద్దతు ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. sఅసూస్‌ రోగ్‌ ఫోన్‌ 8 IP68 డస్ట్‌ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ రేటింగ్‌తో వస్తుంది.

ఈ అసూస్‌ ఫోన్ 8 లాంచ్‌ కార్యక్రమంలో భారత్‌ లో జనవరి 9వ తేదీ 4:30AM IST కి ప్రారంభం అవుతుంది. లాంచ్‌ సమయంలో ధర సహా ముందస్తు బుకింగ్‌లు సహా ఇతర ప్రారంభం ఆఫర్లపై సంస్థ స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లీక్‌ అయిన వివరాలు సహా టీజర్‌ కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Asus ROG Phone 8 set to launch on january 9 2024 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X