ఇండియాలో ఆసుస్ కొత్త ఫోన్ లాంచ్ !

By: Madhavi Lagishetty

తైవనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఆసుస్ ...ఇండియాలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం డ్యుయల్ కెమెరా సెటప్ తో జెన్ ఫోన్ జూమ్ ఎస్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఇండియాలో ఆసుస్ కొత్త ఫోన్ లాంచ్ !

గ్లేషియర్ సిల్వర్, నేవీ బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు స్మార్ట్ ఫోన్ ధర రూ. 26,999. ఆసుస్ zenfone zoom ముందు జెన్ ఫోన్ గా ప్రారంభించబడింది. Cse 2017వద్ద జెన్ ఫోన్ 3 ఈ సంవత్సరం ప్రారంభించారు.

ప్రపంచ ఫోటోగ్రపీ దినోత్సవం సందర్భంగా ఆసుస్ ఇండియా కొత్త జెన్ ఫోన్ జూమ్ ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తూ...ఫోటోగ్రఫీపై అభిరుచి కలిగిన ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆసుస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్, దక్షిణాసియా , దేశీయ అధినేత పీటర్ ఛాంగ్ చెప్పారు.

జెన్ఫోన్ 3-2016 లో ప్రారంభించిన ఫోటోగ్రఫీ కోసం నిర్మించిన ఒక నిశ్చయాత్మక మరియు శాశ్వతమైన నిబద్దత నిర్వహించాము అది వాస్తవమన్నారు.

వినియోగదారులు ప్రతిక్షణం తమ అందాన్ని క్యాచ్ చేసేందుకు జెన్ ఫోన్ జూమ్ ఎస్ సహాయపడుతుదన్నారు. జెన్ ఫోన్ జూమ్ ఎస్ మొబైల్ ఫోటోగ్రపీ కోసం ఒక కొత్త బార్ సెట్ చేస్తుంది. డ్యుయల్ లెన్స్ కెమెరా సిస్టమ్ తోపాటు సాటిలేని బ్యాటరీ ఉంది. ఏదేమైనా స్మార్ట్ ఫోన్ దాని వినియోగదారులకు ఏది అందిస్తుందో తెలియజేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే, ప్రొసెసర్, ర్యామ్ మరియు స్టోరెజి

ఆసుస్ జెన్ ఫోన్ జూమ్ ఎస్ 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యుషన్ తోపాట కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ,5.5స్క్రీన్ డిస్ ప్లే హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625 ఎనిమిది కోర్ 2గిగా హెడ్జ్ ప్రొసెసర్ ,4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజి , మైక్రోఎస్డి కార్డు ద్వారా 2టిబి వరకు విస్తరించవచ్చు. గ్రాఫిక్స్ కోసం ఇది అడ్రినో 506జిపియూతో వస్తుంది.

కెమెరా...

ప్రధాన usp లేదా ఈ స్మార్ట్ ఫోన్ మెయిన్ హైలైట్ దాని డ్యుయల్ కెమెరా సిస్టమ్. ఈ స్మార్ట్ ఫోన్లో రెండు 12మెగాపిక్సెల్ కెమెరాలు, f/1.7 ఎపర్చర్ , 25ఎంఎం వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 59ఎంఎం లెన్స్ తో రెండోది ఉంటుంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు 25ఎంఎం వైడ్ యాంగిల్ ఎన్స్ ఎక్కువ ప్రదేశాన్ని పిక్చర్ తో క్లిక్ చేయవచ్చు. 59ఎంఎం లెన్స్ తో 2.3 ఆప్టికల్ జూమ్ తో పోర్ట్రెయిట్లను కూడా పట్టుకోవచ్చు. ఈ సంస్థ సూపర్ పిక్సెల్ కెమెరా సాంకెతిక పరిజ్జానాన్న ఉపయోగిస్తోంది. ఫోకస్ పెట్టేందుకు స్మార్ట్ ఫోన్ వీలు కల్పిస్తుంది.

ఇక కొత్త కెమెరాలు రాత్రిపూట లేదా తక్కువ కాంతిలో స్పష్టమైన ఫోటోలను తీయడానికి సహాయం చేస్తాయని కంపెనీ చెబుతోది. అంతేకాదు కొత్త సాంకేతికత జెన్ ఫోన్ జూమ్ ఎస్ పై కెమెరాను 2.5 సార్లు ఎక్కువ కాంతి సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. ఇది సగటు స్మార్ట్ ఫోన్ 10సార్లు యావరేజ్ ఉంటుంది.

ఎయిర్‌సెల్ యాప్‌పై బ్రౌజింగ్ ఫ్రీ !

వీటితోపాటు, కెమెరా నాలుగు యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ మరియు మూడో యాక్సిస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ ఫీచర్స్ ను అందిస్తుంది. 19వేర్వేరు ఇతర మోడ్స్ కెమెరా షూట్ సెన్స్ చేయడానికి లేదా ఫోటోలకు ప్రత్యేక భావాలను చేర్చడానికి ఆప్టిమైజ్ చేస్తుంది. సోని ఐఎంఎక్స్ 214 సెన్సర్, f/2.0ఎపర్చరు మరియు ఒక స్ర్కీన్ ఫ్లాష్ ఫీచర్ తో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

బ్యాటరీ మరియు సాఫ్ట్ వేర్...

ఈ హ్యాండ్ సెట్ కు 5000ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది ఇతర డివైస్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంకుగా కూడా రెట్టింపు అవుతుంది. బ్యాటరీ 42రోజులు స్టాండ్ బై ఉంటుంది. ఒకే ఛార్జ్ మీద 6.4గంటల నిరంతర 4కె యుహెచ్ డి వీడియోని పట్టుకోగలదని కంపెనీ వాదిస్తుంది. సాఫ్ట్ వేర్ కోసం స్మార్ట్ ఫోన్ జెన్ యఐ3.0పై నడుస్తుది. ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారంగా రూపొందించబడింది.

ఇతర ఫీచర్లు....

4జి ఎల్టీఈ, వైఫై 802.11/a/b/g/n, gps/agps,nfc,glonass, బ్లూటూత్ మరియు యుఎస్బి టైప్-సి వంటి కనెక్టివిటీ ఎంపికలను అందించే డ్యుయల్ హైబ్రిడ్ సిమ్ డివైస్ జెన్ ఫోన్ జూమ్ ఎస్.

సెన్సార్స్ ఆన్ బోర్డ్ , యాక్సిలరేటర్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటి, గైరోస్కోప్ (కెమెరా ఈఐఎస్ అవసరం కోసం) పరిసర కాంతి సెన్సార్, ఐఆర్ సెన్సర్ మరియు ఆర్జిబి సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కూడా వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.

చివరిగా డివైస్ 154.3 x 77 x7.99ఎంఎం కొలుస్తుంది. 170గ్రాముల బరువు ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Asus has today launched Asus Zenfone Zoom S in India for Rs 26,999.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot