టి-మొబైల్‌ని $30 బిలియన్‌లకు కోనుగోలు చేసిన ఏటి అండ్ టి

By Super
|
టి-మొబైల్‌ని $30 బిలియన్‌లకు కోనుగోలు చేసిన ఏటి అండ్ టి
న్యూయార్క్: యునైటెట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రెండవ అతిపెద్దదైన మొబైల్ సర్వీస్ ప్రోవైడర్ ఏటి అండ్ టి త్వరలో టి-మొబైల్(యుయస్‌ఎ)ని డెస్ట్టీ టెలికాం ఏజి నుండి కోనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. టి-మొబైల్(యుయస్‌ఎ)ని డెస్ట్టీ టెలికాం ఏజి నుండి కోనుగోలు చేయడానికి మొత్తం డబ్బు రూపేనా దాదాపు $39 బిలియన్స్ చెల్లించడానికి డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్‌కి టి-మొబైల్(యుయస్‌ఎ) వారు ఒప్పుకున్నట్లైతే యుయస్‌లో ఏటి అండ్ టి నెంబర్ వన్ సర్వీస్ ప్రోవైడర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఖాయం.

దీంతో ఏటి అండ్ టి మరియు టి-మొబైల్ రెండు యాజమాన్యాలు ఈ డీల్‌కు ఒప్పుకోవడం వల్ల కంపెనీ పురోగతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా దీనివల్ల నెట్ వర్క్ క్వాలిటీ మరియు సర్వీసెస్ కూడా ఇంకా బాగా అభివృధ్ది చెందుతాయని అన్నారు. రెండు కంపెనీలకు సంబధించినటువంటి కస్టమర్స్‌కు కూడా చాలా లాభం జరుగుతందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఎక్కవగా వాడుతున్నందున దీనికి కూడా రెండు కంపెనీలు కలిసి చాలా త్వరగా సర్వీస్ ను ప్రోవైడ్ చేయడం జరుగుతందని అన్నారు.

 

ఈ సందర్బంలో ఏటి అండ్ టి చైర్మన్(సిఈవో)రాన్డాల్ స్టీఫెన్సన్ మాట్లాడుతూ ఈ డీల్ వల్ల యుయస్‌లో ఉన్నటువంటి 294మిలియన్ జనాభాకు నెట్ వర్క్ విషయంలోగానీ, ఎల్టిఈ విషయాలలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉపయోగపడుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా టి-మొబైల్‌ని కోనుగోలు చేయడం వల్ల అమెరికా టెక్నికల్ ఇండస్ట్రీ కూడా బాగా అభివృధ్ది చెందుతుందని అనుకుంటున్నానని అన్నారు.

ఇది మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క డిమాండ్స్‌కు మేము చేరువకాగలం అన్నారు. రెండు కంపెనీలకు సంబంధించినటువంటి నెట్ వర్క్ టెక్నాలజీలు, స్పెక్ట్రమ్ ఆపరేషన్స్ కూడా అందరికి అందుబాటులోకి తేవడానికి మావంతు ప్రయత్నం చేస్తామన్నారు. దీంతో పాటు అమెరికా మొత్తాన్ని హైస్పీడ్, వైర్ లెస్ అమెరికాగా తీర్చిదిద్దుతామని అన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X