ఇండోనేషియాలో లైసెన్సు పోందిన యుఎస్ టెలికామ్ ఆపరేటర్ ఏటి అండ్ టి

Posted By: Staff

ఇండోనేషియాలో లైసెన్సు పోందిన యుఎస్ టెలికామ్ ఆపరేటర్ ఏటి అండ్ టి

యుఎస్ టెలికామ్ ఆపరేటర్ ఏటి అండ్ టి ఇండోనేషియాలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి లైసెన్సు సొంతం చేసుకుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆ తర్వాత కాలంలో ఆసియా దేశాలకు కూడా తన బిజినెస్‌ని విస్తరించనుందని సమాచారం. గతంలో ఇండోనేషియాలో ఉన్నటువంటి లోకల్ ఆపరేటర్స్‌తో కలసి తన బిజినెస్‌ని కోనసాగించేది. ఇండోనేషియాలో లైసెన్సు పోందినటువంటి మొట్టమొదటి విదేశీ టెలికామ్ ఆపరేటర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇండోనేషియాలో ఉన్నటువంటి కంపెనీలకు డైరెక్టుగా తన సర్వీస్‌ను ప్రోవైడ్ చేయనుంది.

ఇండోనేషియా గవర్నమెంట్ జర్నల్ ప్రకారం ఏటి అండ్ టి టెలికామ్ ఆపరేటర్ రెండు సంవత్సరాల పాటు లైసెన్సుని పోందడం జరిగింది. ఈ సందర్బంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ గ్లోబల్ స్ట్రేటజీ ఏటి అండ్ టి) రోమన్ ఫేస్‌విజ్ మాట్లాడుతూ ఆసియా మార్కెట్‌ని మేము ఈజీగా వ్యాల్యూయేట్ చేయడం జరిగింది. అందుకే త్వరలో మా బిజినెస్‌ని థాయ్‌‌లాండ్, వియత్నాంలకు విస్తరించనున్నాం. ఇండోనేషియాలో మాకు లైసెన్సింగ్ ఇవ్వడం వల్ల అభివృద్ది రేటు కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు. రాబోయే కాలంలో యుఎస్ టెలికామ్ సంస్దలకు ఓవరీస్ ఆపరేషన్స్ కీలకం కానున్నాయని అన్నారు. ఇండోనేషియాలోని లోకల్ టెలికామ్ ఆపరేటర్స్ ఏటి అండ్ టి కి లైసెన్స్ ఇవ్వడంతో పెద్ద కాంపిటేషన్‌గా భావిస్తున్నాయన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot