వాజ్‌పేయి లేని టెలికాం రంగాన్ని ఊహించలేము,నమ్మలేని నిజాలివే !
దేశంలో టెలికాం రంగం అద్భుతాలు సృష్టిస్తూ వెళుతుందంటే దీనికి ప్రధాన కారణం Atal Bihari Vajpayeeనే చెప్పుకోవచ్చు.
దేశంలో టెలికాం రంగం అద్భుతాలు సృష్టిస్తూ వెళుతుందంటే దీనికి ప్రధాన కారణం Atal Bihari Vajpayeeనే చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానిగా ఉన్న 1998లో పూర్తిగా టెలికాం రంగం మారిపోయి సరికొత్త రూపును సంతరించుకుంది. అంతకు ముందు టెలికాం రంగంలో పీపీ నరసింహరావు హయాంలో మొబైల్ ఫోన్లు వాడుకలోకి వచ్చినప్పటికీ టెలికాం విధానం అమల్లోకి రాలేదు. ఆ తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన వాజ్‌పేయి టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి ఓ విప్లవానికి తెరలేపారు.

టాప్-3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో..
ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో భారత్ ఒకటిగా వెలుగొందుతుంతంటే దీని వెనక Atal Bihari Vajpayee కృషి ఉందనే చెప్పుకోవచ్చు.

పీవీ నరసింహారావు
1995లో పీవీ నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో మొట్టమొదటి సారి మొబైల్ ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. ఆ సమయంలో దేశంలో మొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను నాటి పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి జ్యోతి బసుకి టెలికాం శాఖ మంత్రి సుఖ్ రామ్ చేశారు.

భారత్‌లో టెలికాం విధానాన్ని ..
అయితే, మొబైల్ టెలికమ్యూనికేషన్‌ల కోసం వీపీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో భారత్‌లో టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టలేదు.

వాజ్‌పేయి ప్రధానమంత్రిగా..
అనంతరం వాజ్‌పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక భారత్‌లో టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్‌కు సూచించారు.

ప్రయివేటు సంస్థలకు..
ఆ రంగంలో భారత్‌లో ప్రయివేటు సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పిస్తూ టెలికాం విధానాన్ని ప్రవేశ పెట్టారు. టెలికాం బిల్లులకు ప్రభుత్వమే నిర్ణీత ఛార్జీలను విధించే విధానాన్ని రద్దు చేశారు.

వృద్ది రేటు
దీని ద్వారా 1994లో 1.2 శాతం ఉన్న వృద్ది రేటు 1999 నాటికి 2.3 శాతానికి ఎగబాకింది. ఇటువంటి వృద్ధి రేటు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాం రంగంలో భారత్ ఆనాడు చాలా వెనుకబడే ఉందని చెప్పాలి.

రూ.7,700 కోట్ల నష్టాలను..
దీనికి ప్రధాన కారణం ప్రభుత్వానికి ప్రతి ఏడాది టెలికాం ఆపరేటర్లు వార్షిక లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి రావడమే. ఇది అభివృద్ధికి ప్రధాన అడ్డకింగా మారింది. దీంతో 22 సెల్యులూర్ ఆపరేటర్లు అప్పట్లో రూ.7,700 కోట్ల నష్టాలను చవిచూశాయి.

రెవిన్యూ షేరింగ్ మోడల్
దీన్ని నివారించడానికి 199లో ప్రభుత్వం రెవిన్యూ షేరింగ్ మోడల్ ని ప్రవేశపెట్టడంతో దశ తిరిగింది. దీని ద్వారా టెలికాం ఆఫరేట్లరు వన్ టైం ఫీజు చెల్లించి వార్షిక రెవిన్యూ షేరింగ్ లో 15 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాలనడంతో టెలికాం రంగం ఉపందుకుంది.

ఏడాదికి రూ. 6,023
ఇదిలా ఉంటే మెట్రో నగరాల్లో సబ్ స్ర్కైబర్ లైసెన్స్ ఫీజు కింద టెలికాం ఆపరేటర్లకు ఏడాదికి రూ. 6,023 చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆ రోజుల్లో చాలా ఎక్కువ. దీంతో వినియోగదారుల మీద చాలా భారం పడేది.

ఇన్ కమింగ్ కాల్ కోసం నిమిషానికి రూ.16.80
1998లో ఇన్ కమింగ్ కాల్ కోసం నిమిషానికి వినియోగదారులు రూ.16.80 చెల్లించాల్సి వచ్చేది. అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలంటే దీని కన్నా ఎక్కువగానే టెలికాం ఆపరేటర్లు వసూలు చేసేవారు.

2000 సంవత్సరంలో BSNL
దీన్ని నివారించడానికి ప్రభుత్వరంగం 2000వ సంవత్సరంలో సపరేట్ పాలసీ ఫార్ములేషన్ తో BSNLని ప్రవేశపెట్టింది. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. ఈ టెలికాం రాకతో ప్రవైట్ మార్కెట్లో విపరీతమైన పోటీ పెరిగి వినియోగదారులకు తక్కువ ధరకు టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

టెలికాం విధానం ద్వారా ప్రయివేటు సంస్థల్లో పోటీ
వాజ్‌పేయి ప్రవేశపెట్టిన టెలికాం విధానం ద్వారా ప్రయివేటు సంస్థల్లో పోటీ పెరిగింది. దీంతో కాల్స్ ధరలు తగ్గుతూ వచ్చాయి. దేశంలో టెలికాం రంగ సేవల్లో నాణ్యత మరింత పెరిగింది. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన టెలికాం పాలసీ, తరువాతి కాలంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా దేశంలో మొబైల్ ఫోన్‌ల తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది.

ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్యను మొబైల్ ఫోన్లు
2004లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశంలో ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్యను మొబైల్ ఫోన్లు అధిగమించాయి. సామాన్యుడు సైతం మొబైల్ ఫోన్లు వాడేలా తన హయాంలో వాజ్‌పేయీ తీసుకున్న నిర్ణయాలే నేడు భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు ఇంతగా వాడకంలో ఉండడానికి దోహదం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వచ్చే ఏడాది టాప్-2లో ..
ప్రపంచం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ వచ్చే ఏడాది టాప్-2లో ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications








