Home
News

4G, ఆండ్రాయిడ్ ఫీచర్లతో లాంచ్ అయిన Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలలో ఒకటైన ఏథర్ ఎనర్జీ సంస్థ తన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450X అనేది ఏథర్ 450 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. ఒరిజినల్ స్కూటర్ లాంచ్ అయిన 1.5 సంవత్సరాల తరువాత అప్‌గ్రేడ్ వెర్షన్ ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి రాబోతున్నది.

ఏథర్ 450X

ఏథర్ సంస్థ దీనిని "సూపర్ స్కూటర్" అనే పదంతో మార్కెటింగ్ చేస్తోంది. లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఏథర్ 450X యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలను కంపెనీ పంచుకుంది. తయారీ మరియు ఫీచర్స్ యొక్క కొన్ని ఇతర అంశాలను కూడా ఇది వెల్లడించింది.

 

 

ఇండియాలో ఏథర్ 450X ధర

ఇండియాలో ఏథర్ 450X ధర

ఇండియాలో ఏథర్ 450X ను రెండు నమూనాలలో విడుదల చేస్తున్నారు. ఇందులో మొదటిది ఏథర్ 450X ప్లస్‌లో మరియు రెండవది ఏథర్ 450X ప్రో. ఏథర్ 450X ప్రో యొక్క సాంప్రదాయ ధర రూ.1,49,000 కాగా ఏథర్ 450X ప్లస్ యొక్క ధర రూ.1,59,000.

 

 

కొనుగోలు కోసం

ఆసక్తిగల కొనుగోలుదారులు ప్లస్ మరియు ప్రో మోడళ్ల ముందస్తు కొనుగోలు కోసం రూ.99,000 చెల్లించాలి. నెలవారి పద్దతిలో ఏథర్ 450X ప్లస్ చందా నెలకు రూ .1,699 ఖర్చు అవుతుంది. అలాగే ఏథర్ 450X ప్రో కోసం నెలకు రూ.1,999. ఇది చందా మోడల్‌ను ఎంచుకోవాలనుకోని కొనుగోలుదారుల కోసం ఏథర్ 450X ధరను వెల్లడించింది.

 

ధర నమూనాను పునరుద్ధరించడం

ధర నమూనాను పునరుద్ధరించడం

ఈ ప్లాన్లను సబ్స్క్రిప్షన్ గా ఏథర్ సూచించడానికి కారణం ప్లాన్ రకం నేరుగా పనితీరును ప్రభావితం చేస్తుంది. ఏథర్ 450X ప్లస్ ప్లాన్ ప్రస్తుత ఏథర్ 450 తో లభించే పనితీరును అందిస్తుంది. అయినప్పటికీ ఏథర్ 450X ప్రో ప్లాన్ సంస్థ ప్రారంభించినప్పుడు తెలిపిన అన్ని రకాల అదనపు పనితీరులను అందిస్తుంది. వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్, లాంగ్ రేంజ్, న్యూ వార్ప్ మోడ్, పెరిగిన మోటారు పనితీరు, బ్లూటూత్ మరియు ఆక్సిస్సోరీ మద్దతు వంటివి ఉన్నాయి.

 

 

Ather 450X స్పెసిఫికేషన్స్

Ather 450X స్పెసిఫికేషన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఇది వేగంగా ఛార్జింగ్ చేయగలదు మరియు ఎక్కువ సమయం పాటు బ్యాక్ అప్ ను అందిస్తుంది. ఇది నిమిషానికి 1.5 కి.మీ వేగంతో ఛార్జింగ్ చేయగల టెక్నాలజీని కలిగి ఉండి ఒక ఛార్జ్ మీద 85 కి.మీ రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందులో గల వార్ప్ మోడ్ 3.3 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగంతో రైడర్స్ ను అనుమతిస్తుంది.

 

బేస్ ఫీచర్

ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450X లో గల బేస్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో OTA అప్డేట్లు, మ్యాప్స్ , రిమోట్ పర్యవేక్షణ, 4G ఇ-సిమ్, వై-ఫై వంటివి మరిన్ని ఉన్నాయి. మరిన్ని యాప్ లను మరియు సర్వీసులను ప్రోత్సహించడానికి ఇది ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌కు మారినట్లు గుర్తించారు.

 

 

సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌

సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌

సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌లో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీని కూడా ఇస్తున్నట్లు ఏథర్ వెల్లడించారు. ఇది లీజు మరియు ఫైనాన్సింగ్ ఎంపికలతో జూలై 2020 నాటికి షిప్పింగ్ ప్రారంభమవుతుంది. ఏథర్ 450X తో ఇండియా అంతటా ఈ బ్రాండ్‌ను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఏథర్ 450X గ్రే, గ్రీన్ మరియు వైట్ తో కలిపి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Ather 450X Electric Scooter Launched in India With 4G and Android Features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X