సెల్ఫీ సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది

Posted By:

సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి పర్వతం అంచున నిలుచుని సెల్ఫీ తీసుకునే క్రమంలో 60 అడుగుల కిందకు పడి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని నమక్కల్ కు చెందిన ప్రకాశ్ అనే విద్యార్థి ఆరుగురు హస్టల్ మేట్స్ తో కలిసి కోలి హిల్స్ కు వెళ్లాడు. అక్కడి జలపాతంలో అందరూ స్నానం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ప్రకాశ్ పర్వతం చివరన ఓ చిన్న రాయిపై నిల్చుని పర్వతం వైపు వెనుక ప్రాంతాన్ని కవర్ చేసేలా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో రాయి దొర్లడంతో ప్రకాశ్ అదుపుతప్పి పర్వతం పై నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఇక సెల్ఫీల పిచ్చి జనాలకు ఎంత ముదిరిపోయిందో కింద చూడండి.

Read more: ఒళ్లు జలదరించే సెల్ఫీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోజుకు 14 సెల్ఫీలు

కొందరు దీన్ని పిచ్చి అనుకోవచ్చు. మరికొందరు వ్యసనం అనుకోవచ్చు. ఏదయితేనేమిగాని యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ మనిపించే దాకా నిద్రపోరట.సెల్ఫీలు తీసుకునేవారిలో యవ్వన వయసు వారిదే అగ్రస్థానం.

 

 

గూగుల్ సర్వే

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గూగుల్ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

 

 

14 సెల్ఫీలు,16 ఫోటోలు

రోజులో సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు,16 ఫోటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే లో వెల్లడయింది.

 

 

21 సార్లు ఓపెన్

సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని 25 టెక్ట్స్ మెసేజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది.

 

 

నాలుగు ఫోటోలు, ఓ వీడియో

ఇదిలా ఉండగా నడి వయస్కులు,అంతకంటే పెద్ద వయసున్నవారు మాత్రం రోజుకు నాలుగు ఫోటోలు ఓ వీడియో 2 నుంచి నాలుగు సెల్ఫీలు తీసుకుంటారట.

 

 

6.9 ఫోటోలు,ఓ వీడియో,4 నుంచి 7 సెల్ఫీలు

టీనేజి వాళ్లయితే 6.9 ఫోటోలు,ఓ వీడియో,4 నుంచి 7 సెల్ఫీలు తీసుకుంటారు.

 

 

సెల్ఫీ ఓ మానసిక రుగ్మత

ఈ నేపధ్యంలో గూగుల్ ఓ ఫోటో యాప్ ను విడుదల చేసింది. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మత గానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

కిమ్ కర్దాషియన్ సెల్ఫీ

కిమ్ కర్దాషియన్ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ ఏనుగు దాడికి గురైన విషయం విదితమే.

 

 

ప్రమాదాలు

కానీ సెల్ఫీలు వినూత్నంగా తీసుకోవడానికి యత్నించి చాలామంది ప్రమాదాలు కొని తెచ్చకుంటున్నారు.

 

 

సెల్పీల పిచ్చి

సో సెల్పీల పిచ్చి ముదిరి పాకాన పడకముందే దాని నుంచి బయటపడటం చాలా మంచిది.

 

 

హీరోలు, హీరోయిన్లు కలిసి దిగిన సెల్ఫీ

86 సంవత్సర ఆస్కార్ అవార్డుల సమయంలో హీరోలు, హీరోయిన్లు కలిసి దిగిన సెల్ఫీ. టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Attempt to Take Selfie Turns Fatal for Engineering Student
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot