సీన్‌లోకి మరో ఇండియన్!!

Posted By: Super

సీన్‌లోకి మరో ఇండియన్!!

 

దేశ వ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న ఆకాష్ టాబ్లెట్ కంప్యూటర్‌కు పోటీగా మరో టాబ్లెట్ పీసీ రూపుదిద్దుకుంది. ఇండియా ఆధారిత సంస్థ టెల్‌మోకో డెవలప్‌మెంట్ ల్యాబ్స్డ్, ‘ఆటిట్యూడ్ దక్షా’ పేరుతో చవక ధర టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. మార్కెట్లో దీని విలువ రూ.5,399. ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో ఈ డివైజ్‌ను రూపొందించారు. వినియోగదారులకు చేరవకావటంలో ఆకాష్ విఫలమైందంటూ విమర్శల దాడి ముమ్మరమవుతున్న నేపధ్యంలో దక్షా టాబ్లెట్ల విడుదల చర్చనీయంశమైంది.

ఆటిట్యూడ్ దక్షా ఫీచర్లు:

5పాయింట్ టచ్‌స్ర్కీన్,

1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

హెచ్‌డిఎమ్ఐ,

మైక్రోఎస్డీ స్లాట్,

3.5ఎమ్ఎమ్ ఆడియో అవుట్,

మైక్రో యూఎస్బీ పోర్టు,

3జీ డాంగిల్‌ను కనెక్ట్ చేసుకునేందుకు OTG కనెక్టర్.

వై-ఫై కనెక్టువిటీ.

ఈ టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ 6 గంటల బ్యాకప్ నిస్తుంది. హైడెఫినిషన్ వీడియోలను తిలికించవచ్చు. నిక్షిప్తం చేసిన 400మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఉత్తమ పనితీరును కనబరుస్తుంది. పాఠశాలలు, ప్రొఫెషనల్ సంస్థలతో పాటు వాణిజ్య కేంద్రాలే టార్గెట్‌గా దక్షాను డిజైన్ చేశారు. మే 15 నుంచి ఈ డివైజ్ మార్కెట్లో లభ్యం కానుంది. ఔత్సాహికులు టెల్ మోకో వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ నిర్వహించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot