Spotify ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో 'ఆడియోబుక్స్' కొత్త ఫీచర్!! ఇక బుక్స్ వినవచ్చు...

|

మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై గురించి అందరికి తెలిసే ఉంటుంది. ప్రయాణ సమయాలలో పాటలను వినడానికి అధిక మంది ఈ స్పాటిఫైను ఉపయోగిస్తున్నారు. ఇందులో అన్ని భాషల యొక్క పాటలను వినడానికి అనుమతిని ఇస్తుంది. అయితే ఇప్పుడు స్పాటిఫై కొత్తగా తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లలో ఆడియోబుక్‌లను విడుదల చేసే విధానంపై పనిచేస్తున్నట్లు దృష్టిని సారించింది. ఇదే విషయాన్ని కంపెనీ యొక్క ఇన్వెస్టర్ సమ్మిట్‌లో స్పాటిఫై వ్యవస్థాపకుడు డేనియల్ ఏక్ ధృవీకరించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఆడియోబుక్స్

స్పాటిఫై కంపెనీ యొక్క సమ్మిట్‌లో వ్యవస్థాపకుడు డేనియల్ ఏక్ మాట్లాడుతూ ప్రింటెడ్ బుక్స్, ఇ-బుక్స్ మరియు ఆడియోబుక్స్, ఆడియోబుక్‌లను కలిగి ఉన్న బుక్ మార్కెట్ ప్రస్తుతం సుమారు $140 బిలియన్ల మార్కెట్ తో ఉంది. వీటిలో ఆడియోబుక్స్ మార్కెట్ వాటాలో కేవలం 6-7 శాతం మాత్రమే ఉందని ఎక్ చెప్పారు. ఆడియోబుక్ పరిశ్రమ 70 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంపై అధికంగా దృష్టిని సారించినట్లుగా కంపెనీ యోచిస్తోందని ఆయన చెప్పారు.

Google Maps లో కొత్త ఫీచర్! మీ ప్లేస్ లోని ఎయిర్ క్వాలిటీని కనుగొనవచ్చు...Google Maps లో కొత్త ఫీచర్! మీ ప్లేస్ లోని ఎయిర్ క్వాలిటీని కనుగొనవచ్చు...

Findaway
 

గత ఏడాది నవంబర్‌లో ప్రముఖ డిజిటల్ ఆడియోబుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్ 'Findaway' ని కొనుగోలు చేయడంతో స్పాటిఫై కంపెనీ గత సంవత్సరం ఆడియోబుక్స్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడానికి మొదటి అడుగును వేసింది. "స్పాటిఫై మరియు Findaway కలయికతో స్పాటిఫై సంస్థ ఆడియోబుక్‌లోకి ప్రవేశించడాన్ని మరింత వేగవంతం చేస్తున్నది. ప్రస్తుత పరిమితులను తొలగించడానికి మరియు సృష్టికర్తల కోసం మెరుగైన ఆర్థిక టూల్లను అన్‌లాక్ చేయడానికి కృషి చేస్తుంది" అని స్పాటిఫై తెలిపింది. ఇదే కనుక జరిగితే ఆడియోబుక్స్ మార్కెట్‌లో ముందడుగు వేసే అవకాశం ఉందని సూచించింది.

Xiaomi బ్రాండ్ నుంచి కొత్తగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ రానున్నది!! ఐఫోన్ 13 సిరీస్ లకు పోటీగాXiaomi బ్రాండ్ నుంచి కొత్తగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ రానున్నది!! ఐఫోన్ 13 సిరీస్ లకు పోటీగా

ఆడియోబుక్ కేటలాగ్‌

"Findaway's టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పాటిఫై తన ఆడియోబుక్ కేటలాగ్‌ను త్వరగా స్కేల్ చేయడానికి మరియు వినియోగదారుల కోసం కొత్త రకమైన అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రచురణకర్తలు మరియు రచయితలకు ఏకకాలంలో కొత్త మార్గాలను అందిస్తుంది" అని కంపెనీ తెలిపింది. ఇప్పుడు కంపెనీ ఆడియోబుక్స్ మార్కెట్‌లోకి ప్రవేశించే ప్లాన్లను అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మ్యూజిక్ మరియు పాడ్‌కాస్ట్‌లతో కలుపుకొని దీనిని తన యొక్క బిజినెస్ లో మూడవ ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

Audible

స్పాటిఫైలో ఆడియోబుక్ ఫీచర్ యొక్క లభ్యత విషయానికి వస్తే కంపెనీ యొక్క రాబోయే ఆడియోబుక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఏక్ వివరించినట్లుగా "సర్వవ్యాప్తి, వ్యక్తిగతీకరణ మరియు ఫ్రీమియం" మిశ్రమాన్ని అందించాలని భావిస్తున్నారు. ఈ సర్వీస్ ప్రారంభించబడినప్పుడు కంపెనీ ఉచిత శీర్షికలు మరియు సబ్‌స్క్రిప్షన్-ఆధారిత శీర్షికల మిశ్రమాన్ని ఆఫర్ చేస్తుందని మీరు ఆశించవచ్చు. భారతదేశంలో ఇప్పుడు అమెజాన్ యొక్క Audible నెలకు రూ.199 ధర వద్ద లభించగా గూగుల్ ఆడియోబుక్‌లలో ఆడియోబుక్‌ల ధర సుమారు $17 (సుమారు రూ.1,323) వద్ద లభిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని Spotify దాని ఆడియోబుక్ టైటిల్‌లను ఎంత ధర వద్ద అందించనున్నది అనేది చూడవలసి ఉంది.

Best Mobiles in India

English summary
AudioBooks New Feature Coming Soon on Spotify Platform: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X