Home
News

చైనా కంపెనీలకు షాక్, 5జీ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసిన ఆస్ట్రేలియా

హువావే అభివృవద్ధి చేసిన 5జీ నెట్‌వర్క్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. సెక్యురిటీ‌పరమైన కారణాల దృష్ట్యా ఈ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Gizbot Bureau

హువావే అభివృవద్ధి చేసిన 5జీ నెట్‌వర్క్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. సెక్యురిటీ‌పరమైన కారణాల దృష్ట్యా ఈ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ చైనాది కావటంతో పాటు అక్కడి ప్రభుత్వంతో దగ్గర సంబంధాలను కలిగి ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అనేక ప్రభుత్వాలు హువావే అభ్యర్థను ఇంకా పరిశీలనలోనే ఉంచాయి.

యూఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు నేపథ్యంలో..

యూఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు నేపథ్యంలో..

హువావే సంస్థను 1987లో చైనా పీపుల్స్ లిబరేషర్ ఆర్మీకి చెందిన మాజీ మేజర్ ఒకరు ప్రారంభించారు. పంచపు అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ సప్లయిర్‌గా కంపెనీ అవతరించింది. అయితే 2012లో ఈ కంపెనీకి తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. యూఎస్ ఫోన్ తయారీ కంపెనీలు హువావే సంస్థకు చెందని ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయవద్దంటూ యూఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించటంతో ఆ ప్రభుత్వం నుంచి హువావేకు తీవ్రమైన వ్యతిరకేత వ్యక్తమైంది.

ZTE కార్పొరేషన్‌కు కూడా ఎదురుదెబ్బే..

ZTE కార్పొరేషన్‌కు కూడా ఎదురుదెబ్బే..

హువావే 5జీ నెట్‌వర్క్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్లాక్ చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. ఆస్ట్రేలియాన్ కస్టమర్ డేటాను తాము ఎన్నడూ చైనీస్ స్పై ఏజెన్సీలకు అప్పగించలేదని తెలిపింది. ఈ వ్యవహారం పై ఆస్ట్రేలియన్ హోంశాఖా మంత్రి స్కాట్ మారిసన్ మాట్లాడుతూ దేశంలో 5జీ నెట్‌వర్క్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు తమ ప్రభుత్వం కమిట్ అయి ఉందని తెలిపారు. తాజా ఉత్తర్వులు నేపథ్యంలో మరో చైనా బ్రాండ్ అయిన ZTE కార్పొరేషన్‌కు కూడా ఎదురుదెబ్బ తగలినట్లయ్యింది.

 

 

అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ సప్లయిర్‌..

అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ సప్లయిర్‌..

షెంజెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న హువావే ప్రపంచపు అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ సప్లయిర్‌గా అవతరించింది. అయినప్పటికి, 2011 ఆస్ట్రేలియా బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ బిడ్డింగ్ నుంచి ఈ సంస్థ నిషేధం ఎదుర్కుంది. తమ 5జీ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హువావే ఆస్ట్రేలియా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించింది.

 

 

దేశపు ఆర్థిక అభివృద్థి పై ప్రభావం చూపే అవకాశం..

దేశపు ఆర్థిక అభివృద్థి పై ప్రభావం చూపే అవకాశం..

లీడింగ్ 5జీ ఎక్విప్‌మెంట్ సప్లయిర్‌గా ఉన్న తమను ఆస్ట్రేలియా ప్రభుత్వం రిజెక్ట్ చేయటం చాలా బాధాకరమైన విషయమని ఇది ఆ దేశపు ఆర్థిక అభివృద్థి పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని హువావే ఆస్ట్రేలియా చైర్మన్ జాన్ లార్డ్ తెలిపారు. చైనా ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న హువావే, జెడ్‌టీఈ కంపెనీలకు ఆ దేశ ప్రభుత్వంతో నెలకుని ఉన్న సంబంధాలు అలానే యూఎస్ కార్యకలాపాలకు సంబంధించి తాము అడిగిన ప్రశ్నలకు ఆ రెండు కంపెనీలు కూడా స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోయాయిని యూఎస్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ తేల్చిచెప్పింది. ఈ కమిటీ నిర్థారణను పూర్తిగా ఖండించిన హువావే తమకు చైనీస్ మిలిటరీలో ఎటువంటి సంబంధాలు లేవని తెలిపింది.

Best Mobiles in India

English summary
Australia bans Huawei from 5G network over security concerns.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X