పేలిన ఐఫోన్ 7: పెను ప్రమాదమే తప్పింది

ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఆపిల్ ఐఫోన్ 7, ఫోన్ ప్రమాదాలు ఇలానే ఉంటాయి జాగ్రత్త

By Hazarath
|

ఆపిల్ ఐఫోన్ ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐఫోన్ కు చార్జింగ్ పెట్టి ఆదమరిచి నిద్రించిన ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. వివరాల్లోకెళితే మెల్ బోర్న్ కు చెందిన మేలెనీ టాన్ పీలెజ్ కొత్తగా ఐఫోన్ 7 కొనుగోలు చేసింది. అది ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తున్న సమయంలో ఆ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

 

ఏ ఏటీఎంలో డబ్బు ఉంది, అక్కడ క్యూ ఎలా ఉంది, ఇట్టే చెప్పేస్తుంది

iphone burn

దీంతో ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనయిందని పడుకునేటప్పుడు సెల్‌ఫోన్ లను దూరంగా పెట్టాలని, ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఎంతమాత్రం వాడటం, పడుకొనేముందు పక్కన పెట్టడం సరికాదని హెచ్చరిస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.

రూ.149కే ఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్,సర్వం సిద్ధం

iphone burn

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐఫోన్ పట్ల ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, కానీ, తనకు ఇలాంటిది జరగడంతో ఇతరులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది. ఫోన్ ప్రమాదాలు ఇలా కూడా జరగవచ్చు.మీరూ ఓ లుక్కేయండి.

జియో సేవలు ఆపేస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

 సెల్ఫీ

సెల్ఫీ

ఒక్కోసారి సెల్ఫీ కూడా చాలా ప్రమాదకరమే. సెల్ఫీలు దిగుతూ ఇప్పటికే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సెల్ఫీలు తీసుకునేవేళ చాలా జాగ్రత్తగా ఉండాలి. 

రోడ్డు దాటేటప్పుడు:

రోడ్డు దాటేటప్పుడు:

రోడ్డు దాటేటప్పుడు మీరు మీ ఫోన్ లో మ్యూజిక్ వింటూ ఉన్నా లేదంటే దాన్ని నొక్కుతూ ఉన్నా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎక్కడో ఆలోచిస్తూ రోడ్డు దాటితే చాలా అనర్థాలకు దారి తీస్తుందట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిద్రలేకపోవడం

నిద్రలేకపోవడం

ఫోన్ మీ పక్కనే పెట్టి పడుకోవడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు మీ దరిచేరే అవకాశం ఉంది.

కంటికి ప్రమాదం
 

కంటికి ప్రమాదం

మీరు స్మార్ట్ పోన్ ను పక్కలో పెట్టుకోవడం వల్ల అందులోనుంచి వచ్చే వెలుతురు మీకంటిని కాటేసే ప్రమాదం ఉంది.మీకు తెలియకుండానే అది కంటిని కాటేస్తుంది.

 

 

సెల్‌ఫోన్‌లో మాట్లాడే పురుషులు

సెల్‌ఫోన్‌లో మాట్లాడే పురుషులు

రోజులో గంటలపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడే పురుషులు తండ్రులుగా మారాలంటే ఇబ్బందులు తప్పవని పరిశోధకులు చెప్తున్నారు. సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు వీర్యకణాల్ని ఉడికిపోయేలా చేస్తాయని హైఫా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్తా డర్న్‌ఫెల్డ్‌ వివరించారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Best Mobiles in India

English summary
Australian Woman Suffers Burns After Falling Asleep On Her iPhone read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X