ఆపిల్ కంపెనీకి చిక్కులు, వారెంట్ నోటీసులు
మొబైల్ దిగ్గజం ఆపిల్ చిక్కుల్లో పడింది. టెక్సాస్ చర్చి కాల్పుల ఘటనల నేపథ్యంలో ఆపిల్ కంపెనీకి వారంట్లు జారీ అయ్యాయి.
మొబైల్ దిగ్గజం ఆపిల్ చిక్కుల్లో పడింది. టెక్సాస్ చర్చి కాల్పుల ఘటనల నేపథ్యంలో ఆపిల్ కంపెనీకి వారంట్లు జారీ అయ్యాయి. ఈ ఘటనలో 27మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో నిందుతుడి ఐ పోన్‌ను లాక్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు విఫలమ్యారు.

దీంతో అతని డేటా కావాలంటూ ఆపిల్ కంపెనీని వారు డిమాండ్ చేశారు. శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, టెక్సాస్ రేంజర్స్ ..కెల్లీ ఐఫోన్ ఎస్‌ఈలోని డేటా యాక్సెస్‌కోసం ఈ సెర్చ్ వారంట్ ఇచ్చింది. సదర్లాండ్ స్ప్రింగ్స్ విషాదానికి కారణమైన డెవిన్ పాట్రిక్ కెల్లీ (26) ఐ ఫోన్ ఎస్‌కి సంబంధించిన డేటా కావాలని ఆదేశించింది.

లోకల్, ఐ క్లౌడ్‌లోని సమాచారం కావాలని కోరింది. ముఖ్యంగా కాల్స్, మెసేజెస్, ఫోటోలు తదితర రికార్డులు సంపాదించేందుకు ఈ నోటీసులు జారి చేసింది. అయితే న్యాయపరమైన అంశం గనుక ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని ఆపిల్ ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications








