ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్దులకు సువర్ణ అవకాశం, ఉచిత సాఫ్ట్‌వేర్‌

Posted By: Super

ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్దులకు సువర్ణ అవకాశం, ఉచిత సాఫ్ట్‌వేర్‌

హైదరాబాద్: ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులను సాంకేతికంగా మరింత ప్రభావంతలును చేసే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లకు సహకారం అందించేందుకు అమెరికాకు చెందిన ఆటో డెస్క్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ ముందుకు వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని వంద ఇంజనీరింగ్‌ కాలేజీ లకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు కంపెనీ ప్ర భుత్వం తోనూ, కాలేజీలతోనూ ఒప్పందం చేసుకోనుం ది. ఆటోడెస్క్‌ కంపెనీ ప్రతినిధులు పొన్నా లతో సచివాలయంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటోడెస్క్‌ కంపెనీ త్రీడీ సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఈ కంపెనీ విద్యారంగంలో సాంకేతికంగా వి ద్యార్ధులను ప్రతిభావంతులుగా చేసేందుకు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని వందకాలేజీలలో ఈ సౌకర్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు.

సాంకేతిక విద్యలో మరింత శిక్షణ ఇవ్వడంతోపాటు ఆటోడెస్క్‌ సర్టిఫికెట్‌ కూడా అందించనుందని, దీని వల్ల ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. ఈ అవకాశం రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్ధు లకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ భేటీలో ఆటోడెస్క్‌ ఆసికయా పసిఫిక్‌ సీనియర్‌ మేనేజర్‌ జార్జ్‌అబ్రహం, ఇండియా సీనియర్‌ మేనేజర్‌ దీపంకర్‌ భట్టాచార్యతో పాటు రాష్ట్ర జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ సిఈఓ అమర్‌నాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot