గూగుల్ ప్లే స్టోర్‌లో 21 యాడ్‌వేర్ గేమింగ్ యాప్ లను కనుకొన్న Avast...

|

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులు వీటిని ఎక్కువగా గేమ్ లను ఆడటానికి కూడా ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఈ గేమ్ లను ప్లే స్టోర్‌ నుండి డౌన్లోడ్ చేసుకొని సరదాగా మరియు టైమ్‌పాస్‌ కోసం ఎక్కువగా ఆడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో యాడ్‌వేర్ లక్షణాలను కలిగి ఉన్న 21 హానికరమైన గేమ్ లను అవాస్ట్ కనుగొన్నారు. వాస్తవానికి ఈ గేమ్ ల వెలుపల అనుచిత ప్రకటనలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలాంటి యాప్ లు మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యాడ్‌వేర్ హానికరమైన గేమింగ్ యాప్ లు
 

యాడ్‌వేర్ హానికరమైన గేమింగ్ యాప్ లు

అవాస్ట్ సంస్థ గుర్తించిన 21 యాప్ లు మరియు గేమ్ లు యాడ్‌వేర్ వర్గంలోకి వస్తాయి. కాబట్టి ఈ యాప్లు మరియు గేమ్లు వినియోగదారుల యొక్క డేటాను దొంగిలించవు మరియు ఇతర హానికరమైన పనులను చేయనప్పటికీ అవి ఆదాయాన్ని సంపాదించడానికి సందేహించని వినియోగదారులకు అనుచిత ప్రకటనలను చూపుతూ ఉంటాయి. ఈ యాప్ లు ఆండ్రాయిడ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత అవి అనుచిత ప్రకటనలను చూపించడం ప్రారంభిస్తాయి.

Also Read: Flipkart Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల మీద 80% వరకు డిస్కౌంట్ ఆఫర్స్...

యాడ్‌వేర్ గేమింగ్ యాప్ ల డౌన్‌లోడ్ పేజీలు

యాడ్‌వేర్ గేమింగ్ యాప్ ల డౌన్‌లోడ్ పేజీలు

సెన్సార్ టవర్ నుండి వచ్చిన డేటా ప్రకారం యాడ్‌వేర్ లక్షణాలను కలిగి ఉన్న ఈ యాప్లు మరియు గేమ్ లను సుమారు ఎనిమిది మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడినట్లు గుర్తించారు. వాటిలో కొన్ని డౌన్‌లోడ్ పేజీలలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా తమ దృష్టిని ఆకర్షించాయని బాధితులు తెలిపారు. వాస్తవానికి అందించిన యాప్ ల కంటే ప్రకటనల ద్వారా లభించిన యాప్లు బిన్నంగా ఉన్నాయి. గేమ్ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాటిలోని ప్రకటనలు వారి ఫోన్‌లను నింపడం ప్రారంభించాయి. ఈ రకమైన సాఫ్ట్‌వేర్ సురక్షితమైన మరియు ఉపయోగకరమైన యాప్ గా మారువేషంలో ఉంటుంది కానీ అనేక అనుచిత ప్రకటనలను ప్రదర్శిస్తుంది. పరికరాల నుండి వాటిని తొలగించకుండా నిరోధించడానికి వారు తమ చిహ్నాలను దాచడం మరియు సంబంధిత డిస్ప్లేతో ప్రకటనలను ప్రదర్శించడం వంటి కొన్ని వ్యూహాలను అవలంబిస్తారు. కావున వాటిని గుర్తించడం మరియు తొలగించడం కష్టమవుతుంది.

అవాస్ట్ కనుగొన్న యాడ్‌వేర్ యాప్ ల పూర్తి వివరాలు
 

అవాస్ట్ కనుగొన్న యాడ్‌వేర్ యాప్ ల పూర్తి వివరాలు

అవాస్ట్ కొత్తగా కనుగొన్న యాడ్‌వేర్ యాప్ ల జాబితాలో 21 గేమ్ యాప్లు ఉన్నాయి. అవి వరుసగా షూట్ థెం, క్రష్ కార్, రోలింగ్ స్క్రోల్, హెలికాప్టర్ అటాక్, అస్సాస్సిన్ లెజెండ్, హెలికాప్టర్ షూట్, రగ్బీ పాస్, ఫ్లయింగ్ స్కేట్బోర్డ్, ఐరన్ ఇట్, షూటింగ్ రన్, ప్లాంట్ మాన్స్టర్, ఫైండ్ హిడెన్, 5 తేడాలు కనుగొనండి, రొటేట్ షేప్ , జంప్ జంప్, ఫైండ్ డిఫరెన్స్ - పజిల్ గేమ్, స్వే మ్యాన్, మనీ డిస్ట్రాయర్, ఎడారి ఎగైనెస్ట్, క్రీమ్ ట్రిప్, ప్రాప్స్ రెస్క్యూ వంటివి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Avast Discovered 21 Adware Gaming Apps on Google Play Store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X