ఇంటర్నెట్‌ని సేఫ్‌గా వాడాల్సిన అవసరం లేదు: సిఈవో(ఎవిజి టెక్నాలజీస్)

Posted By: Staff

ఇంటర్నెట్‌ని సేఫ్‌గా వాడాల్సిన అవసరం లేదు: సిఈవో(ఎవిజి టెక్నాలజీస్)

చాలా మంది తల్లి దండ్రులు తమ పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నారంటూ వారికి ఇంటర్నెట్ సేఫ్‌గా ఎలా వాడాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పమని చాలా మందిని అడుగుతుంటారు. ఇక ఇప్పటి నుండి మీ పిల్లలు ఇంటర్నెట్ వాడుతుంట్ వారికి సేప్టీ ప్రికాషన్స్ అవసరం లేదు. దానికి కారణం ప్రముఖ యాంటీ వైరస్‌ని తయారీసంస్ద ఎవిజి టెక్నాలజీస్ ఫ్యామీలీ కోసం ప్రత్యేకంగా ఎవిజి ఫ్యామిలీ సేఫ్టీ అనే టూల్‌ని కనుగోనడం జరిగింది.

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి పిల్లల గురించి వాళ్శ తల్లిదండ్రులు ఎక్కవగా వర్రీ అవుతుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 80సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ లలో పిల్లలు ఎకౌంట్స్ కలిగి ఉండడం, ఇక పెద్దవారి విషయానికి వస్తే మానేటర్ ఛాటింగ్‌లు, నెట్‌వర్క్ మెసేజెస్ లాంటివి పంపడం జరుగుతుంటాయి. దీంతో వారు వారియొక్క వయసు ఆధారంగా ఎవిజి యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ని రూపోందించడం జరిగింది.

కొత్తగా రూపోందించినటువంటి ఎవిజి ఫ్యామిలీ సేఫ్టీ యాంటి వైరస్ ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్, మొజిల్లా, గూగుల్ క్రోమ్ లాంటి ప్రముఖ బ్రౌజర్స్‌లో రన్ అవుతుంది. కొన్ని వెబ్ సైట్లను దానంతట అదే బ్లాక్ చేయడం మాత్రమే కాకుండా, మానిటర్ కమ్యూనికేషన్ లాంటివి పూర్తిగా చూసుకోని ఆతర్వాత వాటి గురించి తల్లిదండ్రులకు పిల్లలు కంప్యూటర్‌ని ఎలా వాడారో చూపిస్తుంది.

ఈసందర్బంలో జె ఆర్ స్మిత్ సిఈవో(ఎవిజి టెక్నాలజీస్) మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి భాదపడాల్సిన అవసరమే లేదన్నారు. పిల్లల వయసుని బట్టి కొన్ని వెబ్ సైట్లు ఆటోమాటిక్‌గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఇలా అవ్వాలంటే పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్పర్మేషన్ ముందుగా మీరు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ అయినటువంటి ఫేస్‌బుక్, మై స్పేస్, బెబో లాంటి వాటి మీద ఎల్లప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది.

ఒకవేళ మీ పిల్లలు గనుక అలాంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ వేరే కార్యక్రమాలకు వాటినటైతే దాని గురించిన సమాచారం మీకు ఎవిజి ఫ్యామీలీ సాప్ట్‌వేర్ వెంటనే మీకు ఈమెయిల్స్, యస్‌యమ్‌యస్ రూపంలో గానీ తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీ పిల్లలు ఎలాంటి వీడియోస్‌ని గానీ, ఫైల్స్ గానీ డౌన్‌లోడ్ చేసినా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లో ఛాటింగ్ చేసినటువంటి ఫోస్ట్‌లతో సహా మీకు తెలసిపోతుంది. ఇంతకీ దీని ఖరీదు ఎంత అని అనుకుంటున్నారా సంవత్సరానికి కేవలం పదమూడు పౌండ్లు మాత్రమే. దీంతో మీరు మూడు కంప్యూటర్స్‌ని యాంటీ వైరస్ నుండి కాపాడుకోవచ్చు. మూడు కంప్యూటర్స్‌కే కాకుండా పది కంప్యూటర్స్‌ని కూడా యాడ్ చేసుకోనే అవకాశం ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot