Home
News

ఈరోజు నుంచే కొత్త ఫాస్టాగ్ రూల్స్.. ఈ నియమాలు తెలుసుకోకపోతే చాలా రిస్క్‌లో పడతారు..

FASTag: ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులకు ఒక ముఖ్యమైన గమనిక. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025, ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్‌ను తీసుకొస్తోంది. టోల్ గేట్ల దగ్గర పేమెంట్స్ మరింత ఈజీగా, మోసం లేకుండా జరగాలనేది ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశం. మీరు ఫాస్టాగ్ యూజర్ అయితే, జర్నీలో ఎలాంటి చిక్కులు లేకుండా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

* ఫాస్టాగ్ రూల్స్‌లో ముఖ్యమైన మార్పులు ఇవే

మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే, టోల్ ప్లాజా దగ్గర పేమెంట్ డిక్లైన్ అవుతుంది. టోల్ గేట్ దగ్గర స్కానింగ్ చేయడానికి కనీసం 10 నిమిషాల ముందు మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా కూడా పనిచేయదు. అలాంటి టైమ్‌లో మీరు టోల్ ఫీజును డబుల్ క్యాష్ కట్టాల్సి వస్తుంది. అంటే జేబుకు చిల్లు పడినట్టే.

Avoid FASTag Fines  amp amp  Delays  Know the New Rules for 2025

* ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి 70 నిమిషాల గ్రేస్ పీరియడ్

ఒకవేళ మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే, టోల్ గేట్ దగ్గరకు వెళ్లేలోపు దాన్ని రీఛార్జ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడానికి మీకు 70 నిమిషాల టైమ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ వల్ల అనవసరమైన లేట్ ఫీజులు, పెనాల్టీలు తప్పించుకోవచ్చు. ఇది వాహనదారులకు చాలా ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు.

* పెనాల్టీ రీఫండ్ ఆప్షన్

ఒకవేళ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అయి, టోల్ గేట్ దగ్గర డబుల్ ఛార్జ్ కట్ అయితే, మీరు పెనాల్టీ రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, టోల్ గేట్ దగ్గర స్కానింగ్ చేసిన 10 నిమిషాలలోపు మీరు ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అంటే వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి.

* ట్రాన్సాక్షన్ లేట్ అయితే ఎక్స్‌ట్రా ఛార్జీలు

టోల్ గేట్ స్కానర్ దాటిన 15 నిమిషాల తర్వాత టోల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయితే, అదనపు ఛార్జీలు పడే అవకాశముంది. ఇదిలా ఉంటే బ్లాక్‌లిస్ట్ అయిన లేదా తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఫాస్టాగ్ వల్ల రాంగ్ టోల్ డిడక్షన్ జరిగితే, బ్యాంకులు 15 రోజుల తర్వాతే డిస్ప్యూట్ (చార్జ్‌బ్యాక్) రైజ్ చేయగలవు, ఇమ్మీడియట్‌గా ఏమీ చేయలేవు.

* కొత్త రూల్స్‌తో జాగ్రత్త..

కొత్త ఫాస్టాగ్ రూల్స్‌తో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ముఖ్యంగా మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఎప్పుడూ తగినంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే జర్నీకి బయలుదేరే ముందు ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉందో లేదో, బ్లాక్‌లిస్ట్‌లో ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

టోల్ డిడక్షన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఏమైనా డిలేస్ లేదా ఎర్రర్స్ ఉంటే వెంటనే తెలుస్తుంది. అలాగే తగిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఫాస్టాగ్ స్టేటస్ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ, ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. టోల్ బూత్‌ల దగ్గర ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.

* ఫాస్టాగ్ అంటే?

ఫాస్టాగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది ఇండియాలోని టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ లేకుండా పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించి, వెహికల్ టోల్ గేట్ దాటుతుండగానే లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ వాలెట్ నుంచి టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి.

Best Mobiles in India

English summary
New FASTag rules from Feb 17, 2025, by NPCI improve toll payments with blacklist rules, grace period, refunds, delay charges, and chargeback policy. Maintain balance, check status.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X