Home
News

ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్‌ చేస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా?

సైబర్‌ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన సమస్యల్లో ఒకటిగా ఉన్నాయి. భారత్‌ సహా అనేక దేశాల్లో సైబర్‌ నేరగాళ్ల చేతిలో వేల సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం అందివస్తున్న ఆధునిక టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగంగా ఉంటుంది. అదే టెక్నాలజీ, సదుపాయాలను ఉపయోగించుకొని సైబర్‌ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వివిధ మార్గాల ద్వారా డేటా చోరీ చేస్తున్నారు. మరియు స్మార్ట్‌ఫోన్‌లను, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైస్‌లను హ్యాక్‌ చేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌లను (Public USB Charging Stations) టార్గెట్‌ చేస్తున్నారు. దూర ప్రాంత ప్రయాణాల సమయంలో కొంత మంది పవర్‌ బ్యాంకులు సహా అడాప్టర్‌లను తన వెంట తీసుకెళ్తుంటారు. అతి మరికొంత మంది మాత్రం స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను ఛార్జింగ్‌ చేసేందుకు పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌లను వినియోగిస్తున్నారు.

Avoid Public USB Charging stations

ఈ పరిస్థితులను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లలోని డేటాను మాల్‌వేర్‌లను ఉపయోగించి చోరీ చేస్తున్నారు. కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ తరహా పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఎయిర్‌పోర్ట్‌లు, హోటళ్లు, రైల్వే స్టేషన్‌లలో గుర్తించవచ్చు.

USB కనెక్షన్‌లను ఛార్జింగ్‌తోపాటు డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు. దీంతో ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని డేటాను సైబర్‌ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. అయితే అనేక మంది యూజర్లకు ఈ ప్రమాదంపై అవగాహన లేకపోవడంతో దూర ప్రయాణాల సమయంలో ఎక్కువగా పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌లను వినియోగిస్తు్న్నారు. ఫలితంగా డేటాతోపాటు కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఈ పరిస్థితిపై గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. సైబర్‌ భద్రతా నిఫుణులు ఈ పరిస్థితిని జ్యూస్ జాకింగ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఛార్జింగ్‌ అవసరాలు ఎక్కువగా ఉన్న యూజర్లు పవర్‌ బ్యాంక్ లేదా అడాప్టర్‌ను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

అత్యవసర సమయాల్లో మినహా పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌లను వినియోగించవచ్చని సైబర్‌ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సందర్భంలో USB పోర్ట్‌ ద్వారా ఛార్జింగ్‌ చేయాల్సి వస్తే డేటా ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా కేవలం ఛార్జింగ్‌ చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఎటువంటి డేటా ట్రాన్స్‌ఫర్‌ అయ్యే ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

దీంతోపాటు డేటా బ్లాకర్‌ల వినియోగం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఇతర పరికరాలకు డేటా బదిలీ జరగకుండా నివారించవచ్చు. ఛార్జింగ్ సమయంలో డేటా ట్రాన్స్‌ఫర్‌ జరగకుండా నివారించవచ్చు. అయితే ఛార్జింగ్‌ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే హ్యాకర్‌ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది.

అందుకే దూర ప్రాంత ప్రయాణాల సమయంలో ఎలక్ట్రానిక్‌ డివైస్‌లను ముందుగానే ఛార్జింగ్‌ చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆయా సంస్థలు అందించిన ఛార్జింగ్ అడాప్టర్‌లను వెంట తీసుకెళ్లాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జింగ్‌ చేయాలని భావిస్తే మీరు నివాసం ఉండే హోటళ్లలో ఛార్జింగ్‌ చేయడం ఉత్తమం. ఇక్కడ కూడా సైబర్‌ దాడుల ప్రమాదం ఉండవచ్చు. అయితే పబ్లిక్‌ USB ఛార్జింగ్‌ స్టేషన్‌ల కంటే తక్కువ ముప్పు ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Avoid Public USB Charging stations for charging smartphones and electronic gadgets tips to secure data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X