ఫేస్‌బుక్ భద్రంగా, సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Posted By: Staff

ఫేస్‌బుక్ భద్రంగా, సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఏవి అయినా కొత్త కొత్త ఫీచర్స్‌ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటాయి. దీంతో చాలా మందికి కొత్త ఫీచర్స్‌‌ని ఎలా వాడాలో తెలియకపోవచ్చు. దీనివల్ల పర్సనల్ డేటాని జాగ్రత్త చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. దీనిని నుండి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఫేస్‌‌బుక్ ఎకౌంట్‌ సెట్టింగ్స్‌‌లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్‌ని సమర్దవంతంగా ఉపయోగించుకోవడమే. దీని వల్ల ఫేస్‌‌బుక్లో మన ఐడెంటిటీని కాపాడుకోగలుగుతాం.. దీని కోసం మనం ఏమి చేయాలి.. ఏమీ లేదు ఈ క్రింది ట్రిక్స్‌ని పాటిస్తే చాలు....

మరిన్ని ఫేస్‌బుక్ చిట్కాలు

*ఫేస్‌బుక్‌ను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి

ఎప్పుడూ ఒకే విధమైనటువంటి బ్లూ లేదా వైట్ కలర్ ఫేస్‌బుక్‌ని చూసి మీకు బోర్ కోట్టి ఉంటుంది. అలాంటి సందర్బాలలో మీకు కావాలి ఓ సరిక్రోత్త ఫేస్‌బుక్ పేజి. దీనికోసం మనం ఏమిచేయాలంటే మీరు గనుక మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుతున్నట్లైతే స్టైలిష్ అనే యాడ్ ఆన్‌ని డౌన్‌లోడ్ చేసుకోని మీ ఫైర్ ఫాక్స్‌లో ఇనిస్టాల్ చేసుకోవాలి. అందులో మీరు Userstyles.org వెళ్శి మీకు కావాల్సినటువంటి థీమ్‌ని ఇనిస్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టైలిష్ మీద లోడ్ అని క్లిక్ చేయాలి. ధీమ్‌ మొత్తం సెక్సెస్ పుల్‌గా డౌన్ లోడ్ అయిన తర్వాత మీరు కుడి వైపు పైన భాగంలో ఉన్న చిన్న ఐకాన్ యాక్టివ్ చేసుకోవాలి. అంతే దీనితో మీ ఫేస్‌బుక్ పేజికి ఓ కొత్తదనం వస్తుంది.

*ఫేస్‌బుక్ & గూగుల్ సెర్చ్ నుండి మిమ్మల్ని మీరు తోలగించండి

గూగుల్ మరియు ఫేస్‌బుక్ పేర్ల సెర్చింగ్ నుండి మాత్రమే కాకుండా పబ్లిక్ విజిబులిటీ నుండి మిమ్మల్ని మీరు తోలగించుకుంటే బాగుంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ ఎకౌంట్స్ సెట్టింగ్స్ లోకి వెళ్శడమే. Account > Privacy Settings > Connecting on Facebook అందులో వివ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయగానే దాని క్రింద “Search for you on Facebook”, select Friends or Friends of Friends అని వస్తుంది.

*అయిష్టం బటన్‌ని యాడ్ చేసుకోండి

సాధారణంగా మీకు ఇష్టమైన లింక్స్, సిల్లీ ఫోటోస్, కామెంట్స్‌ని మీరు ఎలాగైతే లైక్ బటన్ నోక్కి మీ ఇష్టాన్ని తెలియజేస్తున్నారో అదే విధంగా మీకు నచ్చని వాటి గురించి కూడా మీ ఇష్టాన్ని తెలియజేయడానికి అయిష్టం బటన్‌ని ఇనిస్టాల్ చేసుకోండి. ఈ డిస్‌లైక్ బటన్ యాడ్ ఆన్ మనకు ఫేస్‌బుక్ Dislike 1.2.3 by Thomas Moquet రూపంలో లభిస్తుంది. ఇది గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ రెండింటిలోను పనిచేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచు కోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈ డిస్‌లైక్ బటన్ ఎవరైతే ఇనిస్టాల్ చేసుకుంటారో వారు మాత్రమే చూడడం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting