యాక్సిస్ బ్యాంక్ చేతికి...ఫ్రీఛార్జ్

Posted By: Madhavi Lagishetty

యాక్సిస్ బ్యాంక్...భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్. జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఫ్రీఛార్జ్ పేమేంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ , అకాలిస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 60మిలియన్ల డాలర్ల (385కోట్ల రూపాయలు) “ఫ్రీఛార్జ్” బ్రాండ్ తో డిజిటల్ చెల్లింపులు వ్యాపారాన్ని కలిగి ఉంది.

యాక్సిస్ బ్యాంక్ చేతికి...ఫ్రీఛార్జ్

అయితే ఈ లావాదేవీలు రెగ్యులేటరీ అనుమతికి లోబడి సెప్టెంబర్ 2017 చివరి నాటికి ముగుస్తుంది.

ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోరెక్స్ కార్డులు, యుపిఐ చెల్లింపులు వంటి చెల్లింపు విధానానలను ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ డిజిటల్ అంగీకారంతో 4,33,000Pos, మెషిన్లు, సామ్సంగ్ పే, కొచ్చి మెట్రో , BMTCలతో భాగస్వామ్యం ద్వారా చెల్లింపులో యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లో చురుకుగా పాల్గొంది.

యాక్సిస్ బ్యాంక్ CEOఅయిన శిఖా శర్మ మాట్లాడుతూ “ఫ్రీ ఛార్జీ తిరిగి పొందడం ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక సేవలు డిజిటైజేషన్ కు దారి తీయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొబైల్ ద్వారా యువ వినియోగదారులు సేవలు అందించడంలో గణనీయంగా దోహదం చేస్తామన్నారు.

కనాల్ బాహ్ల్...స్నాప్ డీల్ కో ఫౌండర్-CEO. యాక్సిస్ ఫ్రీఛార్జీ తో ఒప్పందం డిజిటల్ కామర్స్ రంగంలో కొత్త ఒరవడి స్రుష్టించాలనే ఉద్దేశంతో ఫ్రీఛార్జ్ ను కొనుగోలు చేశామన్నారు. మొబైల్ ద్వారా జరిగే లావాదేవీలు అధికమవుతున్న ఈ సమయంలో స్నాప్ డీల్ తో ఒప్పందం దుర్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఫ్రీఛార్జీకి 50మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, 2,00,000మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో 75శాతం మంది 30ఏళ్ల లోపు వారే. 85శాతం మంది వినియోగదారులు మొబైల్ ద్వారా తమ లావాదేవీలను యాక్సెస్ చేస్తున్నారు.

కస్టమర్ ఫేసింగ్ టెక్నాలజీకి ప్రొవైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు మరింత చేరువగా సేవలు అందించడానికి, కొత్త డిజిటల్ విధానం ద్వారా కస్టమర్లకు సమర్థవంతమైన పద్దతిలో చేరుకోవడానికి సహాయపడుతుంది.

Read more about:
English summary
Freecharge claims to be having 50 million registered wallet users and over 2,00,000 merchants.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot