చికెన్, గుడ్డు వెజిటేరియన్‌గా గుర్తించండి, శివసేన ఎంపి సంచలనం

By Gizbot Bureau
|

కోడికూర, కోడిగుడ్డును విజిటేరియన్‌గా గుర్తించాలనే కొత్త డిమాండ్ వచ్చింది. ఇలా చేయమని కోరంది .. ఓ సాద సీదా పౌరుడు కాదు. ఎంపీ, అదీ కూడా పార్లమెంట్‌లో ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. చికెన్, ఎగ్ అయితే మరి మటన్, బీఫ్ ఏంటని సెటైర్లు వేస్తున్నారు. ఎంపీ డిమాండ్‌ను తప్పుపడుతూ కామెంట్లు పేలుతున్నాయి.

చికెన్, గుడ్డు వెజిటేరియన్‌గా గుర్తించండి, శివసేన ఎంపి సంచలనం

 

ఈ వింత డిమాండ్ శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్.. ఆ పార్టీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేతగా మంచి గుర్తింపు ఉంది. కానీ ఆయన సభలో చేసిన డిమాండ్ సర్వత్రా చర్చానీయాంశమైంది. చికెన్, ఎగ్‌ను వెజిటేరియన్‌గా గుర్తించాలని కోరారు. దీంతో సభలో ఉన్న సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆయుర్వేద, యోగ, న్యాచురోపతి, యునాని, సిద్దా, హోమియోపతి మంత్రిత్వ శాఖకు .. సంజయ్ విజ్ఞప్తి చేయడం చర్చకు దారితీసింది.

 ఆయుర్వేదిక్ చికెన్

ఆయుర్వేదిక్ చికెన్

తన డిమాండ్‌కు గల కారణాన్ని కూడా వివరించారు సంజయ్. ఇదివరకు తాను నందూర్‌బర్ గ్రామానికి వెళ్లానిని గుర్తుచేశారు. అక్కడున్న ఆదీవాసీలు తమకు భోజనం పెట్టారని తెలిపారు. అయతే దానిని ఏంటని అడిగితే వారు ఆయుర్వేదిక్ చికెన్ అని చెప్పారని పేర్కొన్నారు. అంతేకాదు ఆ చికెన్ తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగైందన్నారు. అంతేకాదు ఆయుర్వేద కోడిగుడ్లపై చౌదరి చరణ్ సింగ్ వర్సిటీ పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారని తెలిపారు.

 బడ్జెట్‌లో వీటి కోసం నిధులు

బడ్జెట్‌లో వీటి కోసం నిధులు

అంతేకాదు బడ్జెట్‌లో వీటి కోసం నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల కోట్లు కేటాయిస్తే .. ఆయుర్వేద చికెన్, ఎగ్స్ ఉత్పత్తి మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్ డిమాండ్‌పై ట్వీట్టర్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చికెన్, ఎగ్ ఓకే మరి బీఫ్, మస్రూమ్ సంగతేంటని ఒకరు .. మరి మటన్ సంగతేంటని మరొకరు.. ఇలా సెటైర్లు వేస్తున్నారు.

శాకాహారులు సైతం వీటిని తినేలా
 

శాకాహారులు సైతం వీటిని తినేలా

ఆయుర్వేదిక్ మందులు తినే కోడి, అదిపెట్టే గుడ్లు కూడా ఆయుర్వేదిక్ కాబట్టి శాకాహారులు సైతం వీటిని తినేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయుర్వేదానికి ఎంతో ప్రాధన్యాత కల్పిస్తున్న ఆయుష్ శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కనీసం రూ.10వేల కోట్లు పెంచాలని సంజయ్ డిమాండ్ చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యాలకు రెస్పాన్స్ మాత్రం ఊహించని స్ధాయిలో వస్తోంది. పలువురు నెటిజన్లు ఈ విషయంపై సెటైర్లు వేస్తున్నారు.

 ట్వీట్ పంచ్

ట్వీట్ పంచ్

గొడ్డుమాంసాన్ని, మటన్‌ను కూడా శాకాహార జాబితాలో చేరిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఓ నెటిజన్లు వ్యంగ్యాస్త్రం విసిరారు.

 బీఫ్ కర్రీని ఆనియన్ కర్రీ

బీఫ్ కర్రీని ఆనియన్ కర్రీ

బీఫ్ కర్రీని ఆనియన్ కర్రీగా పిలిస్తే ఓ పనైపోతుందని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Ayurvedic’ chicken is vegetarian, Sena MP's demand ridiculed on Twitter

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X