Home
News

పబ్‌జీ యూజర్లకు ఇది నిజంగా చేదు వార్తే, తల్లిదండ్రులకు శుభవార్త

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో కొన్ని రకాల ఆటలకు యువకులు దాకా ఆకర్షితులవుతూ..సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అర్ధరాత్రుళ్ల వరకూ ఫోన్లలో ఆటలాడేలా ప్రేరేపిస్తున్న గేముల్లో పబ్జి అనేది ముఖ్యంగా కనిపిస్తోంద

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో కొన్ని రకాల ఆటలకు యువకులు దాకా ఆకర్షితులవుతూ..సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అర్ధరాత్రుళ్ల వరకూ ఫోన్లలో ఆటలాడేలా ప్రేరేపిస్తున్న గేముల్లో పబ్జి అనేది ముఖ్యంగా కనిపిస్తోంది. చాలామంది యువకులు బానిసలుగా మారి..కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని బహిష్కరించాయి. ప్రత్యర్థులను ఎలా అంతమొందించాలి?, గెలవాలంటే ఎలాంటి తుపాకులను వినియోగించాలి? ఐలాండ్‌లో తిరిగేందుకు ఏ వాహనం ఎంచుకోవాలి? అని తరచూ ఆలోచిస్తూ మానసికంగా దెబ్బతింటున్నారు. ఆటలో ఇతరులను ఇష్టారీతిన చంపేస్తూ హింసాప్రవృత్తి పెంచుకోవడం బాధాకరం.

పబ్‌జీ యూజర్లకు ఇది నిజంగా చేదు వార్తే, తల్లిదండ్రులకు శుభవార్త

ఈ ఆట ఆడేవారిలో చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. ఈ పబ్‌జీ భూతంతో అనేకమంది బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా చైనా ఈ గేమ్ పై కొన్నొ కఠిన నిబంధనలను విధించింది.

13 ఏళ్ల వారు

13 ఏళ్ల వారు

ఎవరైనా పబ్‌జీ గేమ్ ఆడాలనుకుంటే 13 ఏళ్లు దాటి ఉండాలి. అంతకన్నా తక్కువ వయసు వారు ఈ గేమ్ ఆగాడాలనుకుంటే ముందుగా వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసకోవాలి. యంగ్ ప్లేయర్లు దీనికి బాగా అడిక్ట్ అవుతుండటంతో అక్కడ హింసా ప్రవృత్తి పెరుగుతుందని చైనా ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

 

 

చైనా లో ఎప్పుడు

చైనా లో ఎప్పుడు

కాగా చైనా ఈ రకమైన గేమ్ లకు అసలు అవకాశం ఇవ్వదు. చిన్న పిల్లల్ని ఇది మత్తుకు బానిసగా మారుస్తుందని అందువల్ల ఇటువంటివి మా దేశంలోని అనుమతించమని తెలిపింది. అయితే దానికి క్రేజ్ పెరగడం వల్ల రిలీజయిన సంవత్సరం తరువాత దానిని తన దేశంలోకి అనుమతించింది.

గుర్తించేది ఎలా

గుర్తించేది ఎలా

ఈ గేమ్ ఆడాలకునున్న వారు ఫేసియల్ రికాగ్నిషన్ టెక్నాలజీ ద్వారా అందులోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. తద్వారా లాగిన్ అయ్యేవారు ఎంత వయసు గల వారు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలు అయితే వారి తల్లిదండ్రుల నుంచి అనుమతిని చూపిస్తూ అక్కడ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా

స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా

కాగా ఈ ఆట ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఆడుతున్నారు. ఒక్కరు, ఇద్దరు లేదా నలుగురు కలిసి ఒకేసారి ఆన్‌లైన్‌లో ఆడవచ్చు. ముగ్గురు కలిసి కూడా ఆడొచ్చుకానీ..అధికశాతం నలుగురు మిత్రులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒక టీం మాదిరి ఏర్పడి ఆన్‌లైన్లో ఈ ఆటను ఆడుతున్నారు.

 

 

గేమ్ కాన్సెప్ట్

గేమ్ కాన్సెప్ట్

గేమ్‌లో ఒక ఐలాండ్‌ ఉంటుంది. అందులో విమానం నుంచి 100 మంది వారికి నచ్చిన ప్రదేశాల్లో దిగుతారు. ఇందులో నలుగురు మిత్రులు ఉంటారు. వీరికి మిగిలిన 96 మంది శత్రువులవుతారు. ఆ 96 మందిలో సైతం నలుగురితో కూడిన పలు టీంలు ఉంటాయి. వారికి 96 మంది శత్రువులుగా భావిస్తారు.

Best Mobiles in India

English summary
Bad news for PUBG users in China! Users below 13 years of age to ask their guardians to open the game for them
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X