Home
News

వొడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు బ్యాడ్ న్యూస్!! తెలుగు రాష్ట్రాలలో డబుల్ డేటా ప్లాన్‌లు ఇక ఉండవు

భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా చెలామణి అవుతున్న వొడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతం తన వినియోగదారులకు ప్రధాన ప్రీపెయిడ్ ప్లాన్ లతో అందిస్తున్న డబుల్ డేటా ప్రయోజనాన్ని రెండు టెలికాం సర్కిళ్ల నిలిపివేసింది. దీని గురించి కంపెనీ అధికారిక ప్రకటన జారీ చేయలేదు కానీ దీనికి సంబందించిన మార్పులు దాని వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులకు మినహా భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో ప్రస్తుతం ఈ 'డబుల్ డేటా' ప్రయోజనం అందుబాటులో ఉంది.

Vi

వోడాఫోన్ ఐడియా మొత్తంగా మూడు ప్లాన్‌లతో తన వినియోగదారులకు డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అయితే పైన పేర్కొన్న రెండు సర్కిల్‌లలో డబుల్ డేటా ప్రయోజనాన్ని Vi ప్రస్తుతం అందించడం లేదు. కంపెనీ యొక్క సరికొత్త అప్‌డేట్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణాలో డబుల్ డేటా ప్లాన్‌లను తొలగించిన Vi

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణాలో డబుల్ డేటా ప్లాన్‌లను తొలగించిన Vi

వొడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు రూ .299, రూ .449 మరియు రూ .699 ధరల మూడు డబుల్ డేటా ప్లాన్‌లను అందించేది. ఈ ప్లాన్‌లు 4GB రోజువారీ డేటాను అందించడానికి బదులుగా ఈ ప్లాన్‌లు ఇప్పుడు 2GB రోజువారీ డేటాను అందిస్తాయి. ఈ కొత్త మార్పు ఇప్పటికే అమలులో ఉంది మరియు వోడాఫోన్ ఐడియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

డబుల్ డేటా ప్లాన్‌లు

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ డబుల్ డేటా ప్లాన్‌లు ముందు అందించే ఇతర ప్రయోజనాలను ఎప్పటిలాగానే అందిస్తూనే ఉన్నాయి. వినియోగదారులు రోజుకు 100 SMSలు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ముందు మాదిరి పొందుతారు. పైన పేర్కొన్న మూడు ప్లాన్‌లతో ఉచిత ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు ఉన్నాయి. OTT ప్రయోజనాలలో ZEE5 ప్రీమియం మరియు Vi సినిమాలు & టీవీకి ఉచిత సభ్యత్వం ఉంటుంది.

4G డేటా వోచర్‌

వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు ఇప్పటికీ కంపెనీ యొక్క ఈ ప్లాన్‌లతో 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' ఆఫర్‌లను అందిస్తూనే ఉంది. ఇతర సర్కిల్‌ల నుండి కూడా డబుల్ డేటా ప్రయోజనాన్ని త్వరలో తొలగించాలని కంపెనీ భావిస్తోందా లేదా అనే దానిపై ఎటువంటి వివరణ లేదు. ఇది వోడాఫోన్ ఐడియా ప్లాన్ చేస్తున్న టారిఫ్ పెంపులకు అనుగుణంగా ఉండవచ్చు. ఈ ప్లాన్‌ల నుండి తక్కువ డేటాతో వినియోగదారులు కంపెనీ నుండి మరిన్ని 4G డేటా వోచర్‌లను కొనుగోలు చేయవలసి వస్తుంది.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ రూ.299, రూ.399, రూ.449, రూ.599, రూ.699 ధర వద్ద గల ఐదు ప్లాన్‌లపై కంపెనీ డబుల్ డేటాను అందిస్తోంది. రూ.299 ప్యాక్ వినియోగదారులకు రోజుకు 2GB బేస్ డేటా మరియు 2GB అదనపు డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వొడాఫోన్ ప్లే మరియు Zee5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వోడాఫోన్ యొక్క రూ.399 ప్లాన్‌ వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందించాయి. అదనంగా ఈ ప్లాన్‌ వోడాఫోన్ ప్లే మరియు Zee5 స్ట్రీమింగ్ వంటి సేవలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి.అలాగే రూ .599 ప్లాన్ రూ.399 ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీని యొక్క చెల్లుబాటు కాలం 84 రోజులు.

Best Mobiles in India

English summary
Bad News For Vodafone Idea (Vi) Users!! Double Data Plans Will no Longer Exist in Andhra Pradesh and Telangana States
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X