Home
News

Vi యూజర్లకు బ్యాడ్ న్యూస్!! డబుల్ డేటా ఆఫర్ ఇక లేనట్లే...

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో చందాదారులకు అత్యంత ఆకర్షణీయమైన డబుల్ డేటా ప్రయోజనాలను అందించింది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లు, 100 SMS మరియు ఇతర ప్రయోజనాలతో పాటు ప్లాన్ వాస్తవానికి అందించే డేటాకు బదులుగా రెట్టింపు డేటాను అందిస్తుంది. ఇంటి నుండి పని చేసే మరియు ఆన్‌లైన్ గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్‌లో పాల్గొనే వినియోగదారులకు ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ రూ.299, రూ.449 మరియు రూ.699 ధరల వద్ద లభించే ప్లాన్‌ల నుంచి లభించే డబుల్ డేటా ప్రయోజనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

2GB డేటా

స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం మీరు ఇప్పుడు రోజువారీ ప్రాతిపదికన పొందే 4GB డేటాకు బదులుగా వినియోగదారులు ఇకపై 2GB డేటాను మాత్రమే పొందుతారు. ప్రస్తుతానికి Vi డబుల్ డేటా ప్రయోజనాలను నిలిపివేసిన సర్కిల్‌లకు సంబంధించి స్పష్టత లేదు. Vi టారిఫ్ ప్లాన్‌లపై 25% వరకు ధరల పెంపుదల నేపథ్యంలో ఈ ప్రకటన లభించింది. ఈ వారం ప్రారంభంలో Vi తన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్ పెంపును ప్రకటించింది మరియు కొత్త ధరలు ఈ రోజు నుండి అమలులోకి వస్తుంది. Vi ప్లాన్‌లు అందించే ప్రయోజనాలను వాటి సవరించిన ధరలతో పాటు ఇక్కడ నుండి చూద్దాం.

వోడాఫోన్ ఐడియా రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) నుండి ఇంతకుముందు రూ.299 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.359 ధర వద్ద లభిస్తుంది. ఇది రోజుకు 2GB డేటాతో పాటుగా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలలో భాగంగా Vi Movies & TV ప్రయోజనాన్ని పొందుతారు.

వోడాఫోన్ ఐడియా రూ. 539 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 539 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) నుండి ఇంతకుముందు రూ.449 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు తరువాత ఇప్పుడు రూ.539 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు వ్యవధికి అందిస్తుంది. వినియోగదారులు Vi Movies & TV యొక్క ఉచిత OTT సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) నుండి ఇంతకుముందు రూ.699 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు తరువాత ఇప్పుడు రూ.839 ధర వద్ద లభిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ కూడా డబుల్ డేటా ప్రయోజనంను నిలిపివేయబడింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలంలో రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను చందాదారులకు అందిస్తుంది. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే ఇది కూడా Vi Movies & TV ప్రయోజనాలతో బండిల్ చేయబడి వస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) రోజువారి 3GB డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) రోజువారి 3GB డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందించే చౌకైన అపరిమిత ప్లాన్ రూ.501 ధర వద్ద వస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటును మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 16GB డేటా అదనంగా అందిస్తుంది. 3GB రోజువారీ డేటాతో వచ్చే రెండవ ప్లాన్ రూ.701 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క సర్వీస్ వాలిడిటీ 56 రోజులు. అలాగే ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 32GB డేటా అదనంగా అందిస్తుంది. డైలీ 3GB డేటా జాబితాలో లభించే చివరి ప్లాన్ రూ.901 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌ యొక్క సర్వీస్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 48GB డేటా అదనంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్‌లు అన్ని కూడా Vi Movies మరియు TVతో పాటు OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్‌కు 1-సంవత్సరం ఉచిత యాక్సెస్‌తో వస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లతో వినియోగదారులు ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. దీని కింద వినియోగదారులు ఎటువంటి సాధారణ డేటా తగ్గింపు లేకుండా అర్ధరాత్రి 12 మరియు ఉదయం 6 గంటల మధ్య ఇంటర్నెట్‌లో ప్రసారం చేయవచ్చు.

వోడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

వోడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

వోడాఫోన్ ఐడియా ఇంతకుముందు కూడా టారిఫ్‌ల ధరలను పెంచడంలో ఎయిర్‌టెల్‌ను అనుసరించింది. ఎయిర్‌టెల్ ఇంతకు ముందు ధరలను పెంచినప్పుడు వోడాఫోన్ ఐడియా రూ.49 ధర వద్ద లభించే తన బేస్ ప్లాన్‌ను ఆఫర్ నుండి తొలగించింది. రెండు టెల్కోలు వినియోగదారులకు రూ.79 ధర వద్ద అదే బేస్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్‌లలో ఒక్కో వినియోగదారుకు Vi యొక్క సగటు ఆదాయం (ARPU) అత్యల్పంగా ఉందని గమనించండి. కాబట్టి Vi త్వరలో టారిఫ్ పెంపునకు వెళ్లవచ్చు. అది ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న దాని కంటే కొంచెం తక్కువ ధరలో దాని ప్లాన్‌లను ఉంచవచ్చు. అదే సమయంలో తన ARPUని పెంచుకుంటూ Airtel కస్టమర్‌లను దూకుడుగా ఆకర్షించడానికి Vi కి ఇది సరైన మార్గం.

Best Mobiles in India

English summary
Bad News For Vodafone Idea(Vi) Users! Double Data Offer Discontinues From These Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X