ఇండియన్ మార్కెట్‌లోకి శ్యామ్ సంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్

Posted By: Super

ఇండియన్ మార్కెట్‌లోకి శ్యామ్ సంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్

శ్యామ్ సంగ్ మొబైల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ 'బడా'. ఈ సంవత్సరం జులైలో బడా 2.0కి సంబంధించినటువంటి అప్ గ్రేడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇండియాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ బడా 2.0 విషయానికి వస్తే ఇందులో కొత్త ఫీచర్స్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, చిన్న హూం స్క్రీన్, ధర్డ్ పార్టీ సోషల్ నెట్ వర్కింగ్, నెట్ వర్క్ ఇంటిగ్రేషన్ లాంటి అత్యాధునికమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఈ ఆపరేటింగ్ సిస్టిమ్ లైనక్స్, మ్యాక్‌కి సంబంధించినటువంటి ఎస్‌డికె సపోర్టు కూడా చేస్తుంది.

ఈ సందర్బంలో దీపేష్ షా(ఆర్ అండ్ డి సెంటర్, బెంగళూరు) మాట్లాడుతూ ఇండియాలో బడా ఆపరేటింగ్ సిస్టమ్‌కు మంచి రెప్సాన్స్ వస్తుందని భావిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లలో శ్యామ్ సంగ్ మార్కెట్ షేర్ 10-15శాతం వరకు ఉందన్నారు. ఈ సంవత్సరం చివరికల్లా మార్కెట్ షేర్‌ని 30శాతం వరకు పెంపోందించుకోవాలని చూస్తున్నాం అన్నారు.

శ్యామ్ సంగ్ ఆర్ అండ్ సెంటర్ బెంగుళూరులో ఉంది. ప్రస్తుతం బెంగళూరులో బడా ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తయారుచేసే పనిలో 2,000 మంది ఇంజనీర్లు నిమగ్నమైనారు. బెంగుళూరులో మాత్రమే కాకుండా కొరియాలో కూడా ఇంకోక డవలపింగ్ సెంటర్ ఉంది. 30శాతం బడా అప్లికేషన్స్ అన్ని ఆ సెంటర్ లోనే చేయడం జరుగుతుందన్నారు. ఇక ఇండియాలో శ్యామ్ సంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించినటువంటి అయిదు మోడళ్సు మార్కెట్‌‌లో ఉన్నాయని అన్నారు. ఇక వాటి ఖరీదు విషయానికి వస్తే తక్కువలో తక్కువ రూ 8,800 నుండి రూ 20,900 వరకు ఉన్నాయని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot