బైదు కొత్త బిల్డింగ్ దేని కోసం...

Posted By: Staff

బైదు కొత్త బిల్డింగ్ దేని కోసం...

 

చైనా సెర్చ్ ఇంజన్ 'బైదు' దక్షణ చైనాలో కొత్త బిల్డింగ్‌కి శంకుస్దాపనను చేసింది. ఈ కొత్త బిల్డింగ్‌లో సెర్చ్ ఇంజన్ బైదు మొబైల్ ఇంటర్నెట్ రీసెర్చ్ అండ్ డెవప్‌మెంట్ ఆఫీసులకు స్ధానం కల్పించనుంది. ఈ బిల్డింగ్‌ని బైదు దక్షణ చైనాలోని షెంజ్నన్ నగరంలో నిర్మించనుంది. ఇదే బిల్డింగ్ మొబైల్ ఇంటర్నెట్ రీసెర్చ్ అండ్ డెవప్‌మెంట్ టెక్నాలజీకి అంతర్జాతీయ హెడ్ క్వార్టర్‌గా వ్వవహారించనుందని తెలిపింది.

ఈ సందర్బంలో బైదు ఛీప్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో బైదు‌కి విస్తరణలో అతి ముఖ్య పాత్రని పోషించనున్న డ్రైవ్స్‌గా మొబైల్ ఇంటర్నెట్ డెవలప్ మెంటే నని కొనియాడారు. గతయేడాది బైదు 'వైఐ' అనే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెల్ భాగస్వామ్యంతో నిర్మించడమే కాకుండా, స్మార్ట్ ఫోన్‌ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇక పోతే ఈ బిల్డింగ్‌ని బైదు కంపెనీ 2015నాటి కల్లా పూర్తి చేస్తుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot