ఫేస్‌బుక్‌లో రోడ్డు ప్రమాద దృశ్యాలు, పోలీసుల ప్రయోగం

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో రోడ్డు ప్రమాద దృశ్యాలు, పోలీసుల ప్రయోగం

బెంగళూరు: ట్రాఫిక్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం బెంగళూరు పోలీసులు కొత్త ప్రయోగం చేపట్టారు. రోడ్ల మీద జరిగిన ప్రమాద దృశ్యాలను రవాణా పోలీసు విభాగం వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో ఉంచుతోంది. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించి నడిచినా, వాహనాలు నడిపినా... ఫేస్‌బుక్‌లో ఆ చిత్రాన్ని చూసుకోవాల్సి వస్తుంది. 'చిన్న పొరపాటు ఎంత నష్టానికి దారితీస్తుందో తెలియజేయడానికే మేమీ కార్యక్రమం చేపట్టాం.

ఎలా జరిగింది అన్న పోస్ట్‌ మార్టమ్‌ కోసం కాదు, అలాంటి పరిస్థితి మనకూ ఎదురవవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్న అవేర్‌నెస్‌ తేవడమే మా ఉద్దేశం' అంటున్నారు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ ప్రవీణ్‌ సూద్‌. వెయ్యి ఉపన్యాసాలు చేయలేని పని ఒక్క వీడియో చేస్తుందని తాను నమ్ముతున్నానన్నారాయన. బెంగళూరు ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ నగరంలోని కీలక కూడళ్లలో 180 కెమెరాలను ఏర్పాటుచేసింది. ఫేస్‌బుక్‌ పేజ్‌ పోయిన నెలలోనే ప్రారంభించినా అందులో ఈ కెమెరాలలో చిత్రించిన వీడియోలు పెట్టాలన్న ఆలోచన ఈమధ్యే వచ్చిందని, ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నామని అధికారులు అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot