ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ని రూపొందించిన బెంగుళూరు ఐటి కంపెనీ

Posted By: Super

ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ని రూపొందించిన బెంగుళూరు ఐటి కంపెనీ

 

బెంగళూరు: బెంగళూరుకి చెందిన ఐటి కంపెనీ 'డిజిటల్ వేవ్స్' మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ 2.3 టాబ్లెట్ "టాబ్‌ప్లస్ రియో" విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీని ప్రత్యేకతలను గమనించినట్లేతే... 1 GHz కార్టెక్స్ A9 ప్రాసెసర్, 7 ఇంచ్ స్క్రీన్‌తో పాటు, 5 పాయింట్ లిక్విడ్ కెపాసిటివ్ టచ్ దీని సొంతం. "టాబ్‌ప్లస్ రియో" టాబ్లెట్ బరువు 350 గ్రాములు. చుట్టుకొలతలు 203 x 120 x 13 mmగా ఉండనున్నాయని ప్రెస్ విడుదలలో ప్రస్తావించారు.

"టాబ్‌ప్లస్ రియో" టాబ్లెట్ ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ, 512 MB DDR2 మెమరీని కలిగి ఉంది. మెమరీని విస్తరించుకునేందుకు గాను ఇందులో మైక్రో‌ఎస్‌డి కార్డు ప్రత్యేకం. మల్టీ టాస్కింగ్ పనులు వేగవంతంగా చేయడమే కాకుండా, ఫ్లాష్ సపోర్ట్‌ని ఉపయోగించుకుకోని వెబ్ బ్రౌజింగ్, మ్టలీ మీడియా ఫంక్షన్స్‌తో పాటు.. వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్కైపీ ద్వారా వీడియో చాట్, టాబ్లెట్ ముందు భాగాన కెమెరా.. హై డెఫినేషన్ వీడియోలను ప్లే చేసే సత్తా ఉందని డిజిటల్ వేవ్స్ కంపెనీకి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు.

ఇందులో ఉన్న 4 సైడ్ జి-సెన్సార్ సహాయంతో కస్టమర్స్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్‌ని కూడా సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఇటీవల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల చేసిన 300,000 అప్లికేషన్స్‌ని ఈ టాబ్లెట్ ద్వారా యాక్సెస్ చేసుకునే వెసులుబాటుని కల్పించారు. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉన్న దీని ధరను ఇంకా మార్కెట్లో వెల్లిడంచ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot