నెట్‌లో ఆ వీడియో... బెంగుళూరుకూ పాకేసింది!

Posted By:

నెట్‌లో ఆ వీడియో... బెంగుళూరుకూ పాకేసింది!
30 సెకన్ల నిడివితో కూడిన ప్రత్యేక వీడియోలు నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. 2011లో ‘కొలవరి డి' సంచలనం సృష్టించినట్లు, 2012ను ‘గ్యాంగ్నమ్ స్టైల్' కుదిపేసినట్లు, ‘హార్లెం షేక్ ' (Harlem Shake)అనేక ప్రత్యేక హిప్ - హాప్ నృత్యం 2013ను శాసించేందుకు వెబ్ ప్రపంచంలో వ్యాప్తిచెందుతోంది.

ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు స్పెషల్ (జీవిత చిత్రాలు)

అసలీ హార్లెం షేక్ అంటే ఏంటి..? హార్లెం షేక్ అనేక పాశ్చాత్య హిప్ హాప్ నృత్యాన్ని అమెరికాకు చెందిన విద్యుత్ సంగీతకారుడు ఇంకా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత Baauer మే,2012లో సంకల్పించారు. ఈ నృత్యంలో బాగంగా బృందంతో కూడిన వ్యక్తులు వివిధ మోడళ్ల మాస్క్‌లు ఇంకా సూట్ మాదిరి దుస్తులను ధరించి వివిధ భంగిమల్లో నర్తిస్తుంటారు.

బెంగుళూరుకు విస్తరించిన ‘హార్లెం షేక్ ':

ప్రపంచాన్ని కదుపిస్తున్న ‘హార్లెం షేక్ ' హిప్ హాప్ నృత్యం బెంగుళూరుకు విస్తరించింది. నగరంలోని పలువురు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంకా కాలేజ్ విద్యార్థులు సెలవు దినాల్లో ఈ నృత్యంలో పాల్గొని సదురు వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘హార్లెం షేక్ 'నృత్యం వివిధ వర్షన్‌లలో యూట్యూబ్‌లో దర్శనమిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot