కూతుర్ని చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డ ఇన్పోసిస్‌ మాజీ సాప్ట్‌వేర్ ఇంజనీర్

Posted By: Super

కూతుర్ని చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డ ఇన్పోసిస్‌ మాజీ సాప్ట్‌వేర్ ఇంజనీర్

బెంగళూరు: ఇన్పోసిస్‌కు ఇటీవలే రాజీనామా చేసినటువంటి 31 సంవత్సరాల సాప్ట్ వేర్ ఇంజనీర్ తన రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి పాపను చంపి తను కూడా ఆత్మహాత్య చేసుకున్నటువంటి సంఘటన నిన్న బుధవారం బెంగళూరులో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం హొసూరు రోడ్డులోని కుడ్లు గేట్ వద్ద ఉన్నటువంటి అపార్ట్ మెంట్స్‌లలో సంతోష్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ తన కూతురు, భార్య, తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు.

అంతేకాకుండా సంతోష్ గతంలో టాప్ ఐటి కంపెనీలలో పని చేయడం జరిగిందని, ఆరు నెలల క్రితమే తను ఇన్సోసిస్ కంపెనీలో చేరడం జరిగిందని వెల్లడించారు. ఆ సమయంలో తను కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోనడంతో దాని ప్రభావం అతని పని మీద చూపింది. ఆపోలో హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరినటువంటి సంతోష్ ఒక్కసారిగి డిప్రషన్‌లోకి వెళ్శడం జరిగిందని, దాంతో తను చేసేటుటవంటి పనికి చాలా వరకు ఇబ్బంది కలగడంతో మే 16న తనని రాజీనామా చేయమని కోరడం జరిగిందని పోలీసులు తెలియజేశారు.

జాబ్ పోయినటువంటి బాధలో సంతోష్ మరింత డిప్రషన్‌లోకి వెళ్శడం, మొన్న అంటే మంగళవారం ఇన్పోసిస్ కంపెనీతో మరలా వెళ్శి తన జాబ్ గురించి మరోకసారి వాకబు చేయడంతో కంపెనీ ససేమేరా అనడంతో బాధ పడినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి సంతోష్ భార్య తన కూతురు రియా, భార్య ఇద్దరూ కనిపించకపోవడంతో కంగారుపడి ఇల్లంతా వెతకడం ప్రారంభించగా, వేరే రూమ్‌కి లోపల ఎవరో ఉన్నట్లు అలికిడి అనిపించి డోర్ తలుపులు తట్టగా లోపల గడియ వేసుకోని ఉన్నారని అనిపించిందని చెప్పడం జరిగింది.

దాంతో ఇంట్లో ఉన్న మిగతా వారిని అందరిని నిద్రలేపి తన భర్త ఉన్నటువంటి గది వద్దకు తీసుకోవని వెళ్శగా, కిటీకిలోనుండి తన భర్తని మాత్రమే చూడడం జరిగిందని తన కూతురు కనిపించకపోవడంతో ఎక్కడ అని వెతుకుతుండగా తన కూతుర్ని సీలింగ్ ప్యాన్‌కి ఉరివేసి ఉందని సంతోష్ భార్య ఆరోపించింది. ఈ సందర్బంలో సంతోష్ తండ్రి వసంత్ మాట్లాడుతూ తన కొడుకు జాబ్ పోవడంతో డిప్రషన్‌లోకి వెళ్శిపోయాడని, అసలు తాను ఏమిచేస్తున్నాడో కూడా తెలియడంలేదని వాపోయాడు. తనకి ఇంకా ట్రీట్‌మెంట్ అవసరమని చెప్పాడు.

ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన ఇన్విస్టిగేషన్ పరప్పన అగ్రహార పోలీసులు చూసుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా ఇన్విస్టిగేషన్‌లో భాగంగా సంతోషన్ రూమ్‌లో ఓ లిక్కర్ బాటిల్‌ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot