ఈ ఫోటో యాపిల్ మనసు దోచింది
ప్రపంచవ్యాప్తంగా తమ లేటెస్ట్ ఐఫోన్‌ల ద్వారా చిత్రీకరిస్తోన్నఅత్యుత్తమ ఫోటోలకు యాపిల్ ప్రాధాన్యత కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో 2015కు గాను ఐఫోన్ 6ఎస్‌తో చిత్రీకరించబడిన 53 అత్యుత్తమ ఫోటోలను యాపిల్ విడుదల చేసింది. ఈ ఫోటోల్లో బెంగళూరుకు చెందిన ఆశిష్ పర్మార్ చిత్రీకరించిన ఫోటోకు చోటు దక్కటం విశేషం.
Read More : ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

2015 దీపావళి వేడుకల్లో భాగంగా ఆశిష్, సాంప్రదాయ దస్తుల్తో దీపాన్ని పట్టుకుని ఉన్న తన భార్య రైనా ఫోటోను #ShotOniPhone6S ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఆశిష్ పర్మార్ స్తతహాగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఐఫోన్ 6ఎస్ ద్వారా కళాత్మకంగా చిత్రీకరించినఈ ఫోటోకు మంత్రముగ్దమైన యాపిల్ 'Shot on iPhone 6S' ప్రచారంలో చోటు కల్పించింది.
Read More : యాపిల్ ఐఫోన్‌లో 'ఐ' అంటే ఏంటో తెలుసా..?

ఐఫోన్ కెమెరా క్వాలిటీని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో ఈ ప్రచార కార్యక్రమానికి యాపిత్ తెరలేపింది. ఎంపికైన 53 ఫోటోలను హోర్డింగ్స్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పట్టణాల్లో ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఫోటోలతో పాటు ఐఫోన్‌లతో చిత్రీకరించే అత్యుత్తమ 4కే వీడియోలను కూడా ఎంపిక చేసే ఉద్దేశ్యంలో యాపిల్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








